ఆంధ్ర ప్రదేశ్
AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం
Arun Charagondaకడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
Andhra Pradesh: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్, భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ది..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు భర్త. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్ కు ఇన్‌స్టాగ్రామ్ లో వివాహితతో పరిచయం, ప్రేమగా మారింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్నారు భర్త. ఇంద్రశేఖర్ ను పట్టుకుని తన భార్య ముందే దేహశుద్ధి చేశాడు భర్త.
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)
Rudraపల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
Rudraదేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nara Lokesh: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్..ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేస్తామని నారా లోకేష్ వెల్లడి
Arun Charagondaబాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ – టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.
Andhra Pradesh: మంగళగిరిలో కారు బీభత్సం, నలుగురికి తీవ్ర గాయాలు...అతివేగంతో చెట్టును ఢీకొట్టిన కారు, వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి బైపాస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద బీభత్సం సృష్టించింది. అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Andhra Pradesh Shocker: వివాహేతర సంబంధం...భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య..కళ్ళల్లో కారం కొట్టి..వీడియో ఇదిగో
Arun Charagondaకళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది భర్తను హతమార్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చింది భార్య మీనా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
TDP Vs YCP: పుష్ప 2 థియేటర్ల వద్ద ఆగని పొలిటికల్ పైట్..కట్టెలు- ఇనుప రాడ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు...వీడియో ఇదిగో
Arun Charagondaపుష్ప 2 రిలీజ్ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఫైట్ మాత్రం ఆగడం లేదు. పకాలలోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్,మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో పాటుగా టీడీపీ వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించమని టీడీపీ నేతలు చెప్పడంతో గొడవ పెద్దదై కట్టెలు ,ఇనుప రాడ్లతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
Rudraఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
Cabinet Approves New KVs: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్, కొత్త కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
VNSదేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Suresh Gopi: శంకరాభరణం సినిమాలో బ్రోచే వారెవరురా పాటపాడిన కేంద్ర మంత్రి సురేష్ గోపీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyశంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు.
Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు
Hazarath Reddyటీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Viral Video: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నాగచైతన్య - శోభిత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం...వీడియో ఇదిగో
Arun Charagondaఅక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)
Rudraశ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Srikakulam Horror: శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి.. బెల్టుతో దాడి చేసి.. (వైరల్ వీడియో)
Rudraఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు.
Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీలతో పాటు రూ. 5 వేల జరిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Rudraపోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
Andhra Pradesh: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, స్కూళ్లలో పిల్లలకు ఏఐ రంగంలో ట్రైనింగ్
Hazarath Reddyఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.రాష్ట్రంలో యువతకు అవకాశాలపై సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి.
Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి
Hazarath Reddyకాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు.
Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.