
Vizag, AUG 23: ఆలయం అన్నాక హుండీలో భక్తులు కానుకలు సమర్పించుకోవడం పరిపాటే. కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు కానుకలు సమర్పిస్తారు. కొందరు ఖరీదైన కానుకలు ఇస్తారు. బంగారం, వజ్ర వైడూర్యాలు సమర్పిస్తారు. మరికొందరు కోట్ల రూపాయల డబ్బు కానుకగా ఇస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల శ్రీవారి (Tirumala) ఆలయంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో చిత్రవిచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కనిపించింది. బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో ఆ 100 కోట్ల రూపాయల చెక్ (100 Crore Cheque) ఉంది.
అంత భారీ మొత్తంతో చెక్ చూసి ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు. కాగా, చెక్ వేసిన బ్యాంకులో సొమ్ము ఉందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి (Simhadri Appanna Temple Hundi) పేరుతో చెక్ ఉంది. దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో చెక్ రావడం ఇదే ప్రథమం అంటున్నారు ఆలయ అధికారులు.
Posani On Lokesh: నారా లోకేష్ నుంచి నాకు పొంచి ఉన్న ప్రమాదంపై డీజీపీకి ఫిర్యాదు చేశా
విశాఖ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాచలం. ఇక్కడి దేవుడు నారసింహుడు. సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటారు. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపుగా 250 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరి పర్వతం మీద కొలువై ఉన్న విష్ణు స్వరూపం వరాహా నరహింహ స్వామి ఈ అప్పన్న. ఏడాదిలో 364 రోజులు అప్పన్న విగ్రహానికి చందనం పూత పూసి ఉంచుతారు. నిజరూప దర్శనం కేవలం ఏడాదిలో 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విగ్రహం నిత్యం వేడిగా ఉంటుందని, కాబట్టి స్వామి వారిని చల్లబరిచేందకు చందనం పూత పూస్తూ ఉంటారని చెబుతారు.