తెలంగాణ
HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయన సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాలనీలో నోటీసులు అందుకున్నవారిలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు
VNSహైడ్రా (Hydra)దూకుడు కొనసాగుతోంది. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తోంది. ఎవర్నీ వదలకుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.
Wanaparthy : వనపర్తిలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి, అతివేగమే కారణం!
Arun Charagondaవనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి డిపో కి చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా ద్విచక్ర వాహనం అతివేగంతో వెళ్లడం తోనే ప్రమాదం జరిగినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
MLC Kavitha At Shamshabad: శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం, పిడికిలి బిగించి అభివాదం తెలిపిన కవిత, ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు...వీడియో
Arun Charagondaఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.
Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన, తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడటంతో పెళ్లి చేసిన భార్య..వీడియో
Arun Charagondaతన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడటంతో దగ్గరుండి మరి రెండో వివాహం జరిపించింది భార్య. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరుగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Attack On MLA Kale Yadaiah: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సొంతపార్టీ నేతలే కోడిగుడ్లతో దాడి, కష్టపడ్డ కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్..వీడియో వైరల్
Arun Charagondaకాంగ్రెస్‌లో అంతర్గతపోరు మరోసారి బయటపడింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని,కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Fir Agianst Bithiri Sathi: బిత్తిరి సత్తిపై పోలీస్ కేసు, భగవద్గితను బిల్లు గీత అంటూ చేసిన వీడియోపై చర్యలు..ఎఫ్‌ఐఆర్ ఇదిగో
Arun Charagondaబిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం
Arun Charagondaహైడ్రా వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు.
Temple Vandalized in Old City: వీడియోలు ఇవిగో, పాతబస్తీలో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తులు, ఘటనపై మండిపడిన బీజేపీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం దీనికి కారణమైంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
Grand Welcome For MLC Kavitha: సత్యమేవ జయతే, తెలంగాణ భవన్.. కవిత ఫ్లెక్సీల మయం, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు పోటీపడి మరి ఫ్లెక్సీలు కట్టిన బీఆర్ఎస్ నేతలు
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత . ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానుండగా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక తెలంగాణ భవన్ మొత్తం కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. సత్యమేవ జయతే అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు గులాబీ నేతలు.
Hyderabad: లంచాలతో పాటు యువతులతో కానిస్టేబుళ్ల రాసలీలలు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
Arun Charagondaహైదరాబాద్ మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడంతో అక్కడి యువతులతో ఖాకీలు రాసలీలు కొనసాగించారు.
Khammam: మద్యం మత్తులో పేకాట రాయుళ్ల వీరంగం, తలలు పగిలే కొట్టుకున్న యువకులు..వీడియో వైరల్
Arun Charagondaఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పేకాట రాయుళ్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పేకాట ఆడగా ఈ క్రమంలో గొడవలు రాగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలు పలువురి తలలు పగిలి రక్తం రాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Notices To Marri Rajashekar Reddy Colleges: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు
Arun Charagondaతెలంగాణలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా FTL పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు అందజేశారు రెవెన్యూ అధికారులు.
Telangana Thalli statue: తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ భూమిపూజ, సచివాలయం ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహా ఏర్పాటు, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా ప్రారంభం
Arun Charagondaతెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ ,
Hidden Camera In Oyo Room: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో
Arun Charagondaహైదరాబాద్ శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
K Kavitha Walks Out of Tihar Jail: ఉద్విగ్నభరిత వాతావరణంలో ఎమ్మెల్సీ కవిత విడుదల, జైలు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిన కేటీఆర్, ఇవాళ హైదరాబాద్ కు కవిత, ఘనస్వాగతానికి ఏర్పాట్లు
VNSతీహార్ జైలు నుంచి మంగళవారం పొద్దుపోయిన తర్వాత కవిత విడుదలయ్యారు (MLC Kavitha relesed). రౌస్ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్‌కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి!
Arun Charagondaతెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలోనే జన్వాడ ఫాం హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు.
CM Revanth Reddy On Prajapalana: సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం, గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి తరలింపు, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు..
Arun Charagondaసెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్..రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేయాలన్నారు.
BJP MLA Raja Singh On Akbaruddin Owaisi: బీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లిస్ చెరువుల కబ్జా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు
Arun Charagondaమజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని..ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు అని దుయ్యబట్టారు.
KTR Vs Bandi Sanjay: కవితకు బెయిల్..కాంగ్రెస్ విజయమన్న బండి సంజయ్ , బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్, చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుండి విడుదల కానున్నారు కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల ముద్ధం నెలకొంది.
Telangana Liquor Sales: మద్యం కోసమే ఎక్కువ ఖర్చు, దేశంలో తెలంగాణ టాప్, కరోనా సమయంలో తెలంగాణలో తెగ తాగేశారని నివేదిక వెల్లడి
Arun Charagondaలిక్కర్ సేల్స్‌లోనే కాదు మద్యం కోసం ఖర్చు చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికలో షాకింగ్ విషయం వెల్లడైంది. మద్యం కోసం వార్షిక తలసరి ఖర్చు రూ,1623గా ఉండగా బెంగాల్‌లో కేవలం రూ.4 మాత్రమేనన్నారు. కరోనా సమయంలో తెలంగాణలో మరింత ఎక్కువ ఖచ్చు అయిందని సర్వే వెల్లడించింది.