తెలంగాణ

Rain in Hyderabad Videos: హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాఫిక్ జాం, వీడియోలో ఇవిగో

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది

Traffic Police Saves Woman Life: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మాహత్యాయత్నం, క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. దాదాపు 25 ఏళ్ల వయసు ఉన్న యువతి సోమవారం మధ్యాహ్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లింది.

BMW Catches Fire Video: వీడియో ఇదిగో, జూబ్లీహిల్స్‌లో మంటల్లో మాడి మసైపోయిన బీఎండబ్ల్యూ కారు, ఒక్కసారిగా కారు నుంచి దూకేసిన యజమాని

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

Telugu States Rain Update: మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Telangana Horror: హైదరాబాద్‌లో దారుణం, బాలికను రేప్ చేసి ఆపై కాల్చి చంపేసిన కామాంధులు, పురుగులు పట్టిన స్థితిలో ఉన్న కూతురు మృతదేహాన్ని తండ్రి చూసి..

Hazarath Reddy

కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. సగం కాలిన మృతదేహం పురుగులు పట్టిన స్థితిలో కనిపించడం చూసేవారికి కన్నీళ్లు పెట్టిస్తోంది.

Traffic Restrictions: బ‌క్రీద్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వెళ్లే ముందు ఒక‌సారి ఆలోచించుకోండి! ప్ర‌త్యామ్నాయ మార్గాలివే

VNS

ఈ నెల 17న బ్రకీద్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బక్రీద్‌ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు చెప్పారు

Khammam: కుడివైపు గుండె ఉంద‌ని పెళ్లైన 16 రోజుల‌కే భార్య‌ను వ‌దిలేశాడు, కోర్టు చెప్పినా విన‌ని ప్ర‌భుద్దుడు, న్యాయం చేయాలంటూ వీధికెక్కిన మ‌హిళ‌

VNS

గుండె కుడి వైపు ఉందని పెళ్లయిన 16 రోజులకే భార్యను వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని బాధితురాలితో పాటు పెద్దలు ప్రశ్నించినా వినిపించుకోలేదు. చివరకు కోర్టు మందలించినా పట్టించుకోలేదు. దీంతో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నది ఆ అభాగ్యురాలు. ఈ అమానవీయ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

Father’s Day 2024 Wishes: నేడు ఫాదర్స్ డే.. ఈ శుభదినంనాడు మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కోట్స్, కార్డ్స్ తో స్పెషల్ విషెస్ తెలియజేయండి.

Rudra

అమ్మ నవ మోసాలు మోసి జన్మనిస్తే.. వందేండ్ల బతుకును ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న.

Advertisement

Tirumala Senior Citizens Darshan: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.

Father Proud Movement: ఇది క‌దా ఓ తండ్రికి కావాల్సింది! ట్రైయినీ క‌లెక్ట‌ర్ గా వ‌చ్చిన కూతురికి సెల్యూట్ చేసి స్వాగ‌తం ప‌లికిన ఐపీఎస్ తండ్రి

VNS

ఐఏఎస్‌ అధికారిణిగా పోలీస్‌ అకాడమీకి వచ్చిన కుమార్తెకు (IAS Daughter) ఆ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్‌ తండ్రి (IPS Father) సెల్యూట్‌ చేశాడు.

YSRCP Jagan-Lotus Pond House: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్‌ ముందు ఆక్రమణాల కూల్చివేత... నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు తొలగించిన జీహెచ్ఎంసీ

sajaya

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శనివారం కూల్చివేసింది. సమాచారం ప్రకారం, అధికారులు లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ షెడ్లను తొలగించారు.

Traffic Monitoring with Drones: హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కు ‘టెక్’తో చెక్.. డ్రోన్లతో ట్రాఫిక్‌ పర్యవేక్షణ.. సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ఆలోచన.. వారంకిందటి నుంచే అందుబాటులోకి

Rudra

విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే, టెక్నాలజీని వాడుకోవడంలో ఇప్పటికే ముందున్న సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడానికి మరో ముందడుగు వేశారు.

Advertisement

Karimnagar Viral News: ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రుల షాక్.. ఆమె అత్తింటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన వైనం.. కరీంనగర్ లో వింత ఘటన

Rudra

తమకు ఇష్టంలేనప్పటికీ, తనకు నచ్చిన విధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి ఆ తల్లిదండ్రుల బిగ్ షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana: నారాయణపేట మర్డర్, పెద్దపల్లి అత్యాచార ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు, ఉట్కూరు ఎస్సై సస్పెండ్

Hazarath Reddy

తెలంగాణలో రెండు చోట్ల జరిగిన అమానుష ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన అమానుష ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భౌతిక దాడులు, అరాచకాలు, హత్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)

Rudra

హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.

Hyderabad Horror: కొత్తపేటలో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్ చల్, ఇదేం పని అని అడిగిన వ్యక్తిపై కర్రలతో, రాళ్లతో దాడి, అందరినీ అరెస్ట్ చేశామని తెలిపిన సరూర్ నగర్ SHO, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొత్త పేటలో అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని పక్కనే ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ అతనిపై గంజాయి బ్యాచ్ కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Hazarath Reddy

నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు.

Telangana Shocker: దారుణం, ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ళ బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం - జానంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పీహెచ్సీలో పని చేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

RTC Bus Hit Bike: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను డీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్ గా గుర్తించారు.

Hyderabad Shocker: చందానగర్‌లో కత్తితో మహిళ గొంతు కోసిన ఆటోడ్రైవర్, ఫైనాన్స్ వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లక్ష్మి విహార్ ఫేస్ 1 లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్ణాటక సేడం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(32) అనే మహిళ తన భర్త, పదేళ్ల కుమారుడితో కలసి లక్ష్మీ విహార్ ఫేజ్ 1లో నివాసం ఉంటుంది.

Advertisement
Advertisement