తెలంగాణ

Hyderabad: చార్మినార్ వద్ద ఈ రెస్టారెంట్లో చికెన్ తింటే గోవిందా, మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో మాంసం నిల్వ ఉంచిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ చార్మినార్ వద్ద రెస్టారెంట్స్లో తింటున్నారా? అయితే జాగ్రత్త. ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Telangana: ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్‌లను అమ్మడం నిషేధించబడింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబడినది.

Haritha Haram Name Changes: ‘ఇందిర వనప్రభ’గా పేరు మార్చుకోనున్న హరితహారం.. త్వరలో పేరు మార్చనున్న రేవంత్ ప్రభుత్వం

Rudra

పచ్చదనం పెంపే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హరితహారం’ పేరును ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం.

Jaya Jayahe Telangana: జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ ఇవేనా ? తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా

Hazarath Reddy

జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ వచ్చేశాయి. ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ సాంగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు.

Advertisement

Telangana Formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

Vikas M

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రకటించింది. వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యకర్తలను కోరారు.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మేకలు మేపుకుంటున్న మహిళపై ఓ వ్యక్తి దాడి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట్‌లో మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు.మహిళ తమ కాలనీలో తన గొర్రెలు మరియు మేకలను మేపుతుండగా, వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె మేకలను రోడ్డుపై కొట్టాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి ఆమెను వెంబడించి చీపురుతో దాడి చేశాడు.

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.

Road Accident Video: వీడియో ఇదిగో, రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

Advertisement

Heartbreaking Video: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, ఏం జరిగిందో తెలియక రెండేళ్ల కొడుకు తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తూ..

Hazarath Reddy

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళ్లిన తండ్రి, కొడుకులను డీసీఎం డీ కొట్టింది.. ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..

Hyderabad Shocker: అదనపు కట్నం కోసం భార్యపై భర్త దారుణం, అనంతరం మీ కుమార్తె చనిపోయిందంటూ అత్తింటివారికి ఫోన్

Hazarath Reddy

మధురా నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో అదనపు కట్నం కోసం భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి భర్త. అదనపు కట్నం కోసం పాలు విరిగాయి అని సాకుగా చూపి భార్యని దారుణంగా కొట్టాడు.

Jungle Cat Spotted in Hyd: గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి, దాంతో సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించిన స్థానికులు

Hazarath Reddy

హైదరాబాద్ శివార్లలోని గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు అడవి పిల్లిని పట్టుకుని సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్��గించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Hazarath Reddy

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై కూడా నిఘా పెట్టిందని అరెస్టయిన పోలీసు అధికారి ఒకరు తన విచారణలో వెల్లడించినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Threat Call to BJP MLA Raja Singh: చంపేస్తామంటూ రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌, బెదిరింపు కాల్స్‌ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Hazarath Reddy

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్‌ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్‌ చేశారు.

Praja Bhavan Bomb Threat Case: పుల్లుగా తాగి ప్రజా భవన్ బాంబులతో పేల్చేస్తానంటూ కాల్, 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు, రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌

Hazarath Reddy

ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబ్‌ పెట్టినట్లు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసిన రామకృష్ణ.. అధికారులను కంగారు పెట్టించాడు.

Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసిన యువకుడు, చితకబాది పోలీసులకు అప్పగించిన ప్యాసింజర్లు

Hazarath Reddy

కరీంనగర్ - శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌పై గాలిపెల్లి అనిల్ అనే యువకుడు చెప్పుతో దాడి చేశాడు.. దీనితో ఆగ్రహించిన ప్రయాణికులు అతడిని బస్సులోనే బంధించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Road Accident Video: కారు ఉంది కదా అని రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకండి, అమాయకుల ప్రాణాలు తీయొద్దంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్‌ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయండి

Advertisement

Child Selling Racket Busted in Hyderabad: పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు, 16 మంది చిన్నారులను రక్షించామని తెలిపిన సీపీ తరుణ్‌ జోషి

Hazarath Reddy

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.

Telangana ACB Raids RTA Offices: వీడియో ఇదిగో, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, భారీ స్థాయిలో నగదు స్వాధీనం, ఏజెంట్లు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, నాగోల్‌, అత్తాపూర్,మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు

Bomb Threat to Praja Bhavan: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు.

RS 1 Lakh Hospital Bill For Rs 1000 Biryani: వేయి రూపాయల బిర్యానీ తిన్నందుకు రూ. లక్ష రూపాయలు ఆస్పత్రి బిల్లు, రక్తపు వాంతులతో ఆస్పత్రి పాలైన హైదరాబాద్ వాసి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

షాద్‌నగర్ - అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22న షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్నాక ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు..

Advertisement
Advertisement