తెలంగాణ

Six Guarantees Application Status: ఆరు గ్యారెంటీలకు అప్లై చేసి ఉంటే దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి, అయితే మీ అప్లికేషన్ నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి

Hazarath Reddy

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్‌ రూపొందించింది.

Discount on Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలానాలు ఇంకా క్లియర్ చేసుకోలేదా, అయితే ఈ రోజు వరకే డిస్కౌంట్, వాహనదారులు వెంటనే అలర్ట్‌ అవ్వండి

Hazarath Reddy

తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపునకు (Discount on Traffic Challans) గడువు నేటితో ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు సమాచారం.

Charminar Express Derailment: చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో కీలక విషయాలను వెల్లడించిన రైల్వే శాఖ, రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే సైడ్‌ వాల్‌ను ఢీకొట్టిందని వెల్లడి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై మంత్రి పొన్నం విచారం

Hazarath Reddy

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.మొ​త్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు

Charminar Express Derailment Video: వీడియో ఇదిగో, సైడ్‌ వాల్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

Hazarath Reddy

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి

Advertisement

Hyderabad: బీపీ ఎక్కువై చనిపోయిన భర్త, విషాదాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య, హైదరాబాద్ లో ఘటన

VNS

గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు

VNS

చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.

Telangana Police Alert: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే ఇవి చేయకపోతే మీ ఇళ్లు గుల్ల అవ్వడం ఖాయం, ఊరెళ్తున్నవారికి పోలీసులు చేస్తున్న సూచనలివే!

VNS

సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండుగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు

Pre Wedding Shoot in RTC Bus: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఓ జంట ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Panjagutta Car Accident Case: పంజాగుట్ట కారు ర్యాష్ డ్రైవింగ్ కేసు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

పంజాగుట్ట కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Panjagutta Car Accident Case) బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశించింది. అయితే ఈ నెల 17న సోహైల్‌ (Former MLA Shakeel Son Sahil) పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది.

Telangana Road Accident: వీడియో ఇదిగో, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పాఠశాల బస్సును ఢీకొన్న లారీ, 21 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Telangana Fire: వీడియో ఇదిగో, తెలంగాణలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు

Hospital in Medaram: మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రి.. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

Rudra

మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Advertisement

Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

Rudra

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది.

TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్‌ రెడ్డిగా గుర్తింపు

Rudra

అమెరికాలోని టెక్సాస్‌ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో సాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

Telangana Elections 2024: హైదరాబాద్‌కు రాజాసింగ్, పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌లు వీరే

Hazarath Reddy

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Praja Palana Cabinet Sub Committee: ప్రజాపాలన ఆరు గ్యారంటీలపై ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క

Hazarath Reddy

ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. తాజాగా ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని (Praja Palana Cabinet Sub Committee) ఏర్పాటు చేసింది

Advertisement

Telangana Horror: ఆస్తి అమ్మడానికి అడ్డుగా ఉందని తల్లిపై కొడుకు దారుణం, భార్యతో కలిసి అర్థరాత్రి గొంతుకి టవల్ చుట్టి హత్య, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఆస్తి కోసం నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని దారుణంగా (Son kills mother with help of wife) చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Telangana Shocker: షాద్ నగర్‌లో దారుణం, కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు, అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని షాద్ నగర్ - కేశంపేట రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు.

Telangana Road Accident Video: వీడియో ఇదిగో, కరీంనగర్ వెళ్తూ చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 26 మందికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చెట్టును ఢీకొనడంతో గర్భిణి సహా 26 మందికి గాయాలైన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొట్టింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

CM Revanth Review on Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం.. అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, వెబ్ సైట్ ప్రారంభం, నిధుల సేకరణపై రివ్యూ

Rudra

ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు.

Advertisement
Advertisement