తెలంగాణ

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపట్లో భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

Rudra

చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన కాసేపటి క్రితం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Road Accident in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. మరికొందరికి గాయాలు

Rudra

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

Viral Pic: ఒకే ఫొటో ఫ్రేం లో బండి సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి.. రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన నేతలు

Rudra

మానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

Rudra

చారిత్రక ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు పర్యటించనున్నారు. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని మోదీ 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

Advertisement

TS TET: టీచర్‌ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్, టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం, విద్యాశాఖలో సుధీర్ఘంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యలపై సబ్ కమిటీ భేటీ

VNS

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. బీఈడీ (Bed), డీఈడీ (Ded) కోర్సులు పూర్తి చేసి టీచ‌ర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపిక‌బురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET‌) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

Rajaiah Vs Kadiam Srihari: కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ల సృష్టికర్త, ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న వ్యక్తి కడియం అంటూ ఫైరయిన తాటికొండ రాజయ్య, స్టేషన్ ఘన్ పూర్‌ లో ముదిరిన మాటలయుద్ధం

VNS

వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiam Srihari) దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా జరగలేదన్నారు.

Food poisoning in School: వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Hazarath Reddy

తెలంగాణలోని వనపర్తి కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఆహారం తినడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న తరువాత ఫుడ్ పాయిజన్‌తో 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు

Falaknuma Express Fire: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం, రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ట్వీట్‌

Hazarath Reddy

ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు

Advertisement

BMW Hit-And-Run Video: బంజారాహిల్స్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఈడ్చుకుంటూ పోయిన బీఎండబ్ల్యూ కారు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్‌లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది.

TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.

TS SSC Supplementary Results 2023: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

జూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు టెన్త్‌ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలని సూచించారు.

Falaknuma Express Fire: వీడియో ఇదిగో, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో మంటలు, ప్రయాణికులు దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. షాట్‌ సర్క్యూట్‌ కారణంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి

Advertisement

Falaknuma Express Fire Video: వీడియో ఇదిగో, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఎగసిన మంటలు, మూడు కోచ్‌లలో భారీగా మంటలు, ప్రయాణికులంతా సేఫ్

Hazarath Reddy

తెలంగాణ | బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మూడు కోచ్‌లలో మంటలు చెలరేగడంతో దానిని నిలిపివేశారు. ప్రయాణీకులందరూ రైలు దిగారు, ఎటువంటి గాయాలు సంభవించలేదు.

Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్

Rudra

సీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.

Video: పాస్టర్ దారుణం, ప్రార్థనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం, రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య

Hazarath Reddy

బొల్లారంలో పాస్టర్‌గా ఉంటూ ప్రజలకు హిత బోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తన వద్దకు ప్రార్ధనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం.ఈ ప్రబుద్ధుడి బుద్ది తెలిసిన భార్య, ప్రార్ధనలకు మారువేశంలో వెళ్లి మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది.

Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)

Rudra

టీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Ghatkesar Child Kidnap Case: థాంక్యూ సోమచ్ సర్, పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కిడ్నాపైన చిన్నారి కుటుంబ సభ్యులు, ఫోటోలు వైరల్

Hazarath Reddy

ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.

SC on MAA Telangana Party: ఇష్టానుసారంగా పిటిషన్‌లు వేస్తే పేద పార్టీ అంటారా, మా తెలంగాణ పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, పెనాల్టీ కట్టాల్సిందేనని ఆదేశాలు

Hazarath Reddy

మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్‌ వేసినందుకు మా తెలంగాణ పార్టీకి రూ.50 వేల జరిమానా విధించింది

Telangana: వీడియో ఇదిగో, దోసె లేదని చెప్పిన యజమాని, టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టాకున్నావంటూ కత్తితో దాడి చేసిన యువకుడు

Hazarath Reddy

మెదక్ - రామాయంపేటలో మర్కు స్వామి అనే యువకుడు స్థానిక టిఫిన్ సెంటర్లో దోశ అడిగితే లేదు అన్నారని దోసె లేకుంటే టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటూ యజమానిపై దాడికి దిగాడు. దీంతో అతడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Ghatkesar Child Kidnap Case: ఘట్ కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సేఫ్‌, అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులు, గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు

Hazarath Reddy

ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Advertisement
Advertisement