తెలంగాణ
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక, మరో మూడు రోజుల పాటు గాలివానలు, ఎవరూ బయటకు రావొద్దని ఐఎండీ ఆదేశాలు
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి.హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు కొట్టుకుపోయింది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. కొట్టుకుపోయిన హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు.. 40 మంది ప్రయాణికులు సురక్షితం
kanhaహైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, బషీరాబాద్‌, ఓయూ, నాచారం, కొండాపూర్‌, మణికొండ సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షం నీరు.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌..
Hyderabad Rains: వీడియోలు ఇవిగో, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిన హైదరాబాద్, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
Hazarath Reddyహైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది.
Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోక్సో కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు, నిందితుడిని మైనర్‌గానే విచారించాలని కీలక తీర్పు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో (Amnesia Pub Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడిని మేజర్‌గా పరిగణించాలంటూ గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది.
Redya Naik on Revanth Reddy: భూమికి మూరెడు ఉంటడు ఆ బోసి.. కే, రేవంత్ రెడ్డిపై బూతులతో విరుచుకుపడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
Hazarath Reddyమాజీ మంత్రి, బీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను అసభ్య పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
RTC Recognition Society Elections: మూడు నెలల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించండి, కేసీఆర్ సర్కారుకి హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyరెండేళ్లకోసారి జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైకోర్టును ఆశ్రయించింది.
Telangana Horror: యువతికి పెళ్లైనా ఆగని వేధింపులు, అందరూ చూస్తుండగానే యువకుడిని దారుణంగా నరికి చంపిన యువతి కుటుంబ సభ్యులు, మంచిర్యాలలో షాకింగ్ ఘటన
Hazarath Reddyతెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.
Conditional Bail for Sharmila: వైఎస్‌ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్‌, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు వైఎస్సార్‌టీపీ పిలుపు
Hazarath Reddyవైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్‌ చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్, రానున్న రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ప్రజలకు విశాఖ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.
Telangana Horror: షాకింగ్ వీడియో ఇదిగో, పెళ్లైనా ఆగని వేధింపులు, నడిరోడ్డు మీద యువకుడిని దారుణంగా నరికి చంపిన యువతి కుటుంబ సభ్యులు
Hazarath Reddyతెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. షాకింగ్ వీడియో ఇదే..
TS School Summer Holidays 2023: నేటి నుంచి తెలంగాణలో వేసవి సెలవులు, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న బడులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు అమలవుతాయి. దీంతో అన్ని బడులూ జూన్‌ 11వరకు మూతపడి, 12న తిరి­గి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించా­రు.
YS Sharmila Case Update:వైయస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు.. నిన్న పోలీసులతో వాగ్వాదం అనంతరం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు.. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
Rudraవైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు.
Telangana Pending Bills Case: సుప్రీంకోర్టులో కొలిక్కి వచ్చిన తెలంగాణ సర్కార్‌, గవర్నర్‌ పంచాయితీ, గవర్నర్‌ వద్ద పెండింగ్‌ బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyతెలంగాణ గవర్నర్‌ తమిళసై బిల్లులను పెండింగ్‌ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. గవర్నర్‌ తరఫున సొలిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఎలాంటి బిల్లులు లేవని, కొన్ని బిల్లులను తిప్పి పంపారంటూ సొలిటర్‌ జనరల్‌ తెలిపారు
CM KCR in Aurangabad: మ‌హారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఇంటింటికి తాగు నీరు, ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు
Hazarath Reddyమహారాష్ట్రలోని జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన BRS బహిరంగ సభకు కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మరాఠా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో బహిరంగ సభ నిర్వహించడం ఇది మూడోసారి.
CM KCR in Sambhajinagar: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు,ప్రధాని మోదీకి, రాజకీయ నాయకులకు చీమకుట్టినట్లైనా లేదు, ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్
Hazarath Reddyసంభాజీనగర్‌, మహారాష్ట్ర: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధాని, రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదని, ఆఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను తీసుకొచ్చి చూపిస్తున్నారని తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
Hyderabad Shocker: ప్రేమించలేదని బరితెగించిన ప్రేమోన్మాది, యువతి కళ్లలో కారం చల్లి,గొంతు కోసేందుకు ప్రయత్నం, స్థానికులు అడ్డుకోవడంతో పరార్
Hazarath Reddyహైదరాబాద్‌లోని బోరబండలో గల బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, సీబీఐ దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు, అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులు నిలిపివేత
Hazarath Reddyమాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్‌ 30కి ముగియాల్సి ఉంది.
YS Sharmila Arrest: పోలీసులతో వైఎస్ విజయమ్మ వాగ్వాదం, వైఎస్‌ షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని మండిపాటు, బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కిపంపిన పోలీసులు
Hazarath Reddyవైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
TSPSC Paper Leakage: వైఎస్ షర్మిల అరెస్ట్, లోటస్ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఎస్సై, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న షర్మిల
Hazarath Reddyలోటస్ పాండ్‌ (Lotus Pond)లోని వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.
Owaisi Slams Amit Shah: అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలపై మండిపడిన ఒవైసీ, సుధీర్ కమిషన్ నివేదిక చదువుకోవాలంటూ చురక
Hazarath Reddyతెలంగాణలో బిజెపికి ఓటు వేస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని షా హామీ ఇస్తున్నారని ఒవైసీ అన్నారు.