తెలంగాణ

Inter Student Died Of Heart Attack: 16 ఏళ్ల వయస్సులోనే గుండెపోటు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే కుప్పకూలిన ఇంటర్ విద్యార్ధి, ఖమ్మంలో విషాదకర ఘటన, ఆస్పత్రికి తరలించేలోపే మృతి

VNS

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మృతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు రాకేశ్ ను ఆసుపత్రికి తరలించే లోపు రాకేశ్ మృతి చెందాడు. గుండెపోటుతోనే రాకేశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Twitter War Governor, Harish Rao: మెడికల్ కాలేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రెండు నాల్కల ధోరణి, వరుస ట్వీట్లతో గవర్నర్ తమిళిసైతో తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ అటాక్..

kanha

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వైద్య కళాశాలల కేటాయింపుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ఆదివారం నాడు మండిపడ్డారు

Chaganti Koreswararao: టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు.. ఎందుకంటే? వీడియోతో..

Rudra

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి విముఖత వ్యక్తం చేశారు.

Telangana Cabinet Meeting: 9న తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చ?! వీడియోతో..

Rudra

సీఎం కేసీఆర్ అధ్యక్షతన 9న తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఇళ్ల స్థలాలు కలిగి ఉండి, సొంత ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

TRS Again In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...? ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ.. దీంతో తెరమరుగైన టీఆర్ఎస్ పేరు.. అయితే టీఆర్ఎస్ పేరుతో కొందరు కీలక నేతల పార్టీ పేరు రిజిస్ట్రేషన్.. వీడియోతో

Rudra

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.

Hyderabad Shocker: టెన్త్ స్టూడెంట్ తో కలిసి 23 ఏళ్ల మహిళా టీచర్ జంపు జిలానీ, ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు

kanha

23 ఏళ్ల మహిళా స్కూల్ టీచర్ కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థిని పోలీసులు రక్షించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న బాలుడు ఫిబ్రవరి 16 నుంచి కనిపించకుండా పోయాడు.

Viral Video: హైదరాబాద్ సీఎంఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీలో గుండెపోటుతో బీటెక్ స్టూడెంట్ మృతి వైరల్ వీడియో

kanha

గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు.

Hyderabad Water Supply Disruption: మార్చి 8 నుంచి మార్చి 10 వరకూ హైదరాబాద్, సికిందరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో మంచినీరు బంద్, మీ ఏరియా కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మార్చి 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు 66 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.

Advertisement

Revanth Reddy Accident: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో రేవంత్ కాన్వాయ్ లో ఆరు కార్లు ధ్వంసం, రేవంత్ సేఫ్, ఊపిరి పీల్చుకున్న అభిమానులు

kanha

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రకు వెళ్తుండగా యల్లారెడ్డిపేట వద్ద జరిగిన ఈ ఘటనలో న్యూస్ ఛానళ్లకు చెందిన రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

TTD Good News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు

Rudra

తిరుమల శ్రీవారిని కాలినడకన వెళ్ళి దర్శించుకునే వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.

Student Dies With Heart Attack: వీడియో ఇదిగో.. గుండెపోటుతో కాలేజీలో కుప్పకూలిన విద్యార్థి, మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో విషాదకర ఘటన

Hazarath Reddy

మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్‌ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు.

Satvik Suicide Case: ఆ నలుగురి వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య, శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ సూసైడ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు

Hazarath Reddy

నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ కేసులో నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో లెక్చరర్‌ ఆచార్య, వార్డెన్‌ నరేష్‌ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని రాజేంద్రనగర్‌ మేజిస్ట్రేట్‌ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు

Advertisement

Governor vs CS: ఢిల్లీ కన్నా రాజ్‌భవన్‌ దగ్గరగా ఉంది, సీఎస్‌పై పంచ్ డైలాగ్ పేల్చిన గవర్నర్ తమిళిసై,బిల్లుల పెండింగ్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీఎస్ శాంతి కుమారి

Hazarath Reddy

సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు

Foxconn to Invest in Telangana: తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు, లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపిన ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ

Hazarath Reddy

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌( CM KCR )తో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ( Young Liu )భేటీ అయి ఈ విషయాన్ని ప్ర‌క‌టించారు.

Products from Cow Dung: ఆవు పేడతో సరికొత్త ఉత్పత్తులు, ప్లాస్టిక్‌ను భర్తీ చేయగల వస్తువులను తయారు చేసే పనిలో స్టార్టప్ కంపెనీ

Hazarath Reddy

తెలంగాణ రాజధాని స్టార్టప్ హైదరాబాద్ లో ఓ స్టార్టప్ కంపెనీ పార్టికల్ బోర్డ్‌లు, ప్లాస్టిక్‌ను భర్తీ చేయగల ఉత్పత్తులను ఆవు పేడతో తయారు చేస్తుంది.మేము ఆవు పేడ నుండి బయో-బేస్డ్ & బయో-డిగ్రేడబుల్ కాంపోజిట్స్ & బయో-ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసాము

Telangana Shocker: మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి బ్యాచ్ అరాచకం, బాలుడి బట్టలు విప్పి బెల్ట్,కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఓ గంజాయ్ బ్యాచ్ ఓ బాలుడి (17) ని ( Minor Boy ) చిత్రహింసలకు గురిచేసింది.గంజాయి మత్తులో ఈ బ్యాచ్ మైనర్ బాలుడిపై దారుణంగా దాడి (Minor Boy Assaulted by Ganja gang)చేశారని పోలీసులు తెలిపారు

Advertisement

Hyderabad: పెళ్లి కార్డులు ఇచ్చేందుకు ముంబైకి హెలికాప్టర్‌లో వెళ్లిన వ్యాపారవేత్త, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

హైదరాబాద్ వ్యాపారవేత్త మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు ముంబైకు హెలికాప్టర్ లో వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. త్వరలో మధు యాదవ్ తమ్ముడి వివాహం జరగనన్న నేపథ్యంలో ముంబైలో ఉన్న బంధువులకు, మిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు.

Video: పీకల దాకా తాగిన పోలీస్ కానిస్టేబుల్‌, అర్థరాత్రి రోడ్డు మీద అసభ్యకరంగా తిడుతూ వసూలు దందాలు, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన శంషాబాద్‌ పోలీసులు

Hazarath Reddy

శంషాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ పీకల దాకా మద్యంతాగి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాజమల్లయ్య (35) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్వాల్‌గూడ ఔటర్‌రింగ్‌ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు

AP Global Investor Summit 2023: ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి

Hazarath Reddy

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని కేటీఆర్‌ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Jeedimetla Fire: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం, రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వాడ అయిన జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు.

Advertisement
Advertisement