తెలంగాణ
Telangana Fire: కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు, 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతి, వీడియో ఇదిగో..
Vikas Mసంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి కంటైనర్‌లో తరలిస్తున్న 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ముంబై నుంచి హైదరాబాద్ లోని ఓ షోరూంకి తీసుకువెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Container Catches Fire: ఖరీదైన కార్లు తరలిస్తున్న కంటైనర్ లో చెలరేగిన మంటలు, పూర్తిగా కాలిపోయిన 8 కార్లు, జహీరాబాద్ హైవేపై ఘటన
VNSకొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు (Fire Accident in Zaheerabad) చెలరేగి.. 8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు (Container Catches Fire) చెలరేగాయి.
KTR:దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా..కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్, కేటీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సవాల్
Arun Charagondaకేటీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హౌలా సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్...వరంగల్ అభివృద్ధిపై పదేళ్లు మీరేం చేశారు..? ఏడాదిలో మేం ఏం చేశాం..? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా...ఐదేళ్లు మహిళను మంత్రిగా చేయలేని మీరు మా మంత్రుల గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేయిస్తుంటే.. ఎదురు తిరగమని కేటీఆర్ అంటున్నారు...ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అన్నారు.
KTR: బీసీ డిక్లరేషన్ బోగస్...42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చాకే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి,కులగణనలోని ప్రశ్నలు తగ్గించాలని డిమాండ్
Arun Charagondaబీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నారు.
Tiger In Mancherial: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో
Arun Charagondaతెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో శనివారం తెల్లవారుజామున సంచరించింది పెద్దపులి. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు తెలుస్తోండగా ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోకి పెద్దపులి రావడంతో అధికారులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ సిబ్బంది.
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్, విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?, తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు, తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టరెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెషర్, ధ్వంసమైన ప్రహరీ గోడ...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టరెంట్‌లో ఫ్రిజ్ కంప్రెషర్ పేలింది. దీని ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Yadagirigutta Temple: కార్తీక మాసం..యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం...దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు
Arun Charagondaకార్తీక మాసం నేపథ్యంలో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని వెల్లడించారు ఆలయ అధికారులు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.
TG Holidays: 2025లో 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు.. సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Rudraవచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది.
AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Rudraనైరుతి బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
Viral Video: బైక్ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraరోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.
Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.
KCR Comments on Congress Govt: నిర్మించేందుకు అధికారం ఇచ్చారు, కూల్చేందుకు కాదు! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపని ధీమా
VNSప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యతను అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్ (BRS) నాయకులు భయపడవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Hydra: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అక్రమకట్టడాల తొలగింపు,హర్షం వ్యక్తం చేసిన స్థానికులు..వీడియో ఇదిగో
Arun Charagondaఅక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో అక్రమ నిర్మణాలపై ఫిర్యాదులు రావడంతో వాటిని తొలగించారు హైడ్రా అధికారులు. ఫిలింనగర్ లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు..రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో రేకుల షెడ్డు నిర్మాణం, ప్రహరీ గోడను కూల్చివేశారు. ఆక్రమణల కూల్చివేతతో రహదారి విస్తరణ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు స్థానికులు.
MLA Padi Kaushik Reddy: దళిత బంధు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నా, అరెస్ట్ చేసిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం, పలువురికి గాయాలు
Arun Charagondaహుజురాబాద్‌లో దళిత బంధు లబ్దిదారుల పక్షాన ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా లబ్దిదారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురికి గాయాలు కాగా ఎమ్మెల్యేతో సహా పలువురిని ఆస్పత్రికి తరలించారు.
Harishrao Praises KTR: కేటీఆర్‌పై హరీశ్ రావు ప్రశంసలు, ఐటీలో తెలంగాణను నెంబర్ 1 చేసిన కేటీఆర్ అంటూ కితాబు, ప్రశ్నించే గొంతుకలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి సరికాదని ఆగ్రహం
Arun Charagondaకేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేటీఆర్ ఐటీలో తెలంగాణను నంబర్ 1 చేసిండు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు.. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాదుకు పెట్టుబడులు కేటీఆర్ తెచ్చిండన్నారు.
Nagarjuna Sagar Project: మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ
Arun Charagondaమరోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నెలకొంది. KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.
Minister Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ, దీపావళి రోజున సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి
Arun Charagondaతెలంగాణలో మరో మంత్రి ఇంట్లో చోరీ జరిగింది. నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరగగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉంటున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఈనెల 31వ తేదీన దీపావళి రోజున సెల్ ఫోన్ చోరీ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి శ్రీధర్ బాబు.
Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు, ఏకంగా సీపీ సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్, అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన
Arun Charagondaసైబర్ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. పాకిస్థాన్ కోడ్ ఉన్న నంబర్లతో కాల్స్ వస్తుండగా సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు సీపీ సీవీ ఆనంద్.