New Delhi, May 19: జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీకి (Chat GPT) విశేష ఆదరణ లభించడంతో ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ చాట్‌జీపీటీ యాప్‌ను క్రియేట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. చాట్‌జీపీటీ (Chat GPT )యాప్‌గా పొరబడుతూ ఎవరైనా నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే అన్ఇన్‌స్టాల్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకు చాట్‌జీపీటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఓపెన్ఏఐ (Open AI) ఈరోజు వెల్లడించగా త్వరలో అండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ చాట్‌జీపీటీ యాప్‌లుగా చలామణిలో ఉన్న యాప్‌లన్నీ నకిలీవేనని (fake Chat GPT ) స్పష్టమైంది.
యూజర్లను మోసగించే ఉద్దేశంతోనే స్కామర్లు ఫేక్ చాట్‌జీపీటీ (Fake Chat GPT App) యాప్‌లను తెరపైకి తెచ్చారు. స్కామర్లు వేలాది ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్‌ను క్రియేట్ చేసి యూజర్ల వద్ద వేలాది డాలర్లు కొల్లగొడుతున్నారని ఓ సైబర్ సెక్యూరిటీ వెబ్‌సైట్ వెల్లడించింది. కొన్ని యాప్స్ ప్రజలను మోసం చేస్తూ అధిక చార్జీలతో అందినంత దండుకుంటున్నాయని లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.
గూగుల్ ప్లేస్టోర్ (Play Store), యాపిల్ యాప్ స్టోర్స్‌లో (Apple Store) పలు యాప్స్ చాట్‌జీపీటీని పోలిన విధంగా ఉన్నాయని, ఇవన్నీ నకిలీ యాప్స్ అని సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ గుర్తించింది. వీటిని ప్రజలు సరిగ్గా గుర్తించకుండానే ఖరీదైన ప్లాన్స్‌తో సబ్‌స్క్రైబ్ చేసుకునేలా అవి ఆకట్టుకునే ప్రకటనలు గుప్పిస్తున్నాయని పేర్కొంది. ఏఐ, చాట్‌బాట్స్‌కు ప్రస్తుతం నెలకొన్న క్రేజ్‌తో చాట్‌జీపీటీని పోలిన యాప్స్‌ను యూజర్లు యాపిల్ యాప్, గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మోసపోతున్నారని సోఫోన్ ప్రిన్సిపల్ థ్రెట్ రీసెర్చర్ సీన్ గలగర్ వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక ప్రకటనల ఎత్తుగడతో ఫేక్ యాప్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.