New Delhi, Aug 04: ప్రముఖ మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, వాట్సాప్ (Whatsapp) యూజర్ ప్రైవసీ, డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు భద్రతా చర్యలను చేపట్టింది. మెసేజ్ పంపినవారు, స్వీకరించే వారి మధ్య యూజర్ కంటెంట్‌ను గోప్యంగా ఉంచడానికి అప్లికేషన్ ఇప్పటికే పర్సనల్ చాట్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగిస్తోంది. అదనంగా, వాట్సాప్ ఇటీవల అకౌంట్ సెక్యూరిటీని పటిష్టం చేయడానికి కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. గుర్తుతెలియని కాలర్లను సైలంట్ చేయడం, చాట్ లాక్ వంటి అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ హ్యాకర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది. అందువల్ల, వాట్సాప్ డెవలప్‌మెంట్ టీమ్ మరిన్ని ఫీచర్‌లను రూపొందించడంలో బిజీగా ఉంది. ఈ భద్రతా పరిణామాలకు అనుగుణంగా అకౌంట్ వెరిఫికేషన్ కోసం యూజర్లు తమ ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. (Wabetainfo) నివేదికల ప్రకారం.. వాట్సాప్ ఈ ఇమెయిల్ వెరిఫికేసన్ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ ఆన్ చేసినట్లయితే.. మీ అకౌంట్ ప్రొటెక్ట్ చేయడానికి వెరిఫై చేయడానికి వాట్సాప్ ఇమెయిల్ అడ్రస్ వినియోగించాల్సి ఉంటుంది.
Samsung Costly TV: 110 ఇంచుల సామ్ సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే! ఫీచర్స్ అద్భుతః
ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఇంకా డెవలప్ స్టేజీలో ఉంది. వాట్సాప్ అకౌంట్ల భద్రతను మెరుగుపరచడానికి ఈ-మెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఫీచర్ తీసుకురానుందని నివేదిక తెలిపింది. ఉదాహరణకు, మీ ఫోన్ దొంగిలించినా లేదా వినియోగదారులు వాట్సాప్‌తో లింక్ చేసిన వారి ఫోన్ నంబర్‌కు యాక్సస్ కోల్పోతే.. ఇమెయిల్ వెరిఫికేషన్ వారి అకౌంట్ యాక్సెస్ చేయడానికి, లాగిన్ చేయడానికి సాయపడుతుంది.
కొత్త డివైజ్‌లో వాట్సాప్ సెటప్ చేసేటప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, సర్వర్ లేదా నెట్‌వర్క్ సమస్యల కారణంగా వెరిఫికేషన్ కోడ్ రావడం లేదు. ఈ ఫీచర్ యూనిక్‌గా ఉంటుందని, టూ ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ విధానం కన్నా భిన్నంగా ఉంటుందని గమనించడం ముఖ్యం. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. యాప్ ఫ్యూచర్ అప్‌డేట్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు.
వాట్సాప్ జూన్ 2023కి నెలవారీ రిపోర్టును లాంచ్ చేసింది. ఆ తర్వాతి నెలలో ప్లాట్‌ఫారమ్ స్వీకరించిన ఫిర్యాదులను ఎలా పరిష్కరించింది అనే విషయాలను నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. జూన్ 1, జూన్ 30, 2023 మధ్య వాట్సాప్ భారతీయ యూజర్ల 6,611,700 అకౌంట్లను నిషేధించింది. వినియోగదారుల నుంచి నివేదికలను స్వీకరించిన తర్వాత చాలా అకౌంట్లు నిషేధించినప్పటికీ.. యూజర్ల నుంచి ఏవైనా రిపోర్టులు అందుకోకముందే 2,434,200 అకౌంట్లను ముందుగానే నిషేధించిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021కి అనుగుణంగా ప్రతి నెలా నెలవారీ యూజర్ల భద్రతా నివేదికను విడుదల చేస్తుంది. ఈ నివేదిక వివిధ అంశాలకు ప్రతిస్పందనగా వాట్సాప్ చర్యల వివరాలను అందిస్తుంది.