Science
New Wheat Variety: ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. అభివృద్ధి చేసిన జర్మనీ పరిశోధకులు
Rudraఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని మ్యూనిచ్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు.
Chandrayaan 3 Update: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో మరో విజయం, చంద్రుని కక్ష్య నుంచి భూకక్ష్య వైపు ప్రొపల్షన్‌ మాడ్యుల్‌, ఇస్రో ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyచంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది.
Home Saliva Test: లాలాజలంతో డయబెటిస్‌ టెస్ట్‌.. కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు
Rudraరోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు.
Wine Taste with AI: ఏఐ సాయంతో వైన్‌ రుచి తెలుసుకోవచ్చు.. ఎలాగంటే??
Rudraవైన్‌ ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.
DNA to Moon: చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న అమెరికా రిటైర్డ్ ప్రొఫెసర్.. ఎందుకంటే?
Rudraఅమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు.
Somanath on Aditya-L1: జనవరి 7న ఎల్‌1 కక్షలోకి ఆదిత్య.. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడి
Rudraసూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్‌1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్‌ పాయింట్‌(ఎల్‌1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు.
Early Dinner: రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తే దీర్ఘాయుష్షు.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు.
Pesticides Effects on Sperm Count: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో తగ్గుతున్న వీర్య కణాలు.. సంతానోత్పత్తిపై ప్రభావం.. తాజా అధ్యయనం
Rudraపురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌ స్పెక్టివ్స్‌ జర్నల్‌ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
Plants Absorb More CO2: కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా మొక్కలకు మరింత పెరిగిందోచ్.. ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’జర్నల్‌ లో తాజా అధ్యయనం
Rudraవాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతున్నదన్న విషయం తెలిసిందే. అయితే మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.
Chandrayaan 4 Mission: జయహో ఇస్రో.. చంద్రయాన్ 4 వచ్చేస్తోంది, ఈ సారి ఏకంగా రెండు ల్యాండర్లను చంద్రుని పైకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
Hazarath Reddyచంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో రెండు చంద్ర అన్వేషణ మిషన్లపై కసరత్తు చేస్తోంది.
Toolbag Orbiting Earth: ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువు.. వ్యోమగాముల పట్టు జారి భూమి చుట్టూ తిరుగుతున్న టూల్‌ కిట్‌ బ్యాగ్.. ఏమైనా ప్రమాదమా?
Rudraప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌ కిట్‌ బ్యాగ్‌ భూమి చుట్టూ తిరుగుతున్నది.
Milky Way Galaxy: మన పాలపుంత నుంచి విడిపోతున్న నక్షత్రాలు.. ఇప్పటికే దాదాపు 1 కోటి నక్షత్రాలు బయటకు.. ఎందుకంటే??
Rudraమన పాలపుంత నుంచి కొన్ని నక్షత్రాలు విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు.
Chikungunya Vaccine: చికెన్‌ గున్యాకు తొలి టీకా.. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం
Rudraదోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్‌ వ్యాధి చికెన్‌ గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌ గున్యా వ్యాక్సిన్‌ కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.
Pralay Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం, ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది
Hazarath Reddyఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది.భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది
Aditya-L1 Update: సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ఫోటోను పంపిన ఆదిత్య-ఎల్‌1
Hazarath Reddyభారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది
Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్‌-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి
Rudraమానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్‌-సీ సప్లిమెంట్స్‌ తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.
Predictions on End of Humanity: మానవాళి అంతంపై సంచలన నివేదిక వెలుగులోకి, సూపర్ ఖండం ఏర్పడి భూమి మీద మానవజాతి అంతరించిపోతుందని అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyమానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు
Extinction-Level Event: ‘కిలోనోవా’ పేలుడుతో భూమిపై జీవం అంతం? ఇంకా ఎన్నేండ్లలో ప్రమాదం ఉన్నదంటే?
Rudraవిశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్‌ విషయాన్ని కొనుగొన్నారు.
Corona, Cancer Detection in Three Minutes: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం.. యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి
Rudraకొవిడ్‌, క్యాన్సర్‌ ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Self Healing Plastic: తనకు తాను రిపేర్‌ చేసుకొనే ప్లాస్టిక్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల అభివృద్ధి
Rudraతనను తాను రిపేర్‌ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్‌ అయ్యే ప్లాస్టిక్‌ ను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు.