Twitter data breach Hacker put 200M users’ private information Representative image

New Delhi, June 18: ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ (Smart phone) వాడుతున్నారు. ఫోన్ వాడకంలో మన అవసరాలకు అనుగుణంగా గూగుల్ ప్లే స్టోర్ (Play store) నుంచి వివిధ రకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటాం. కానీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) బయట పెట్టిన వార్త విన్నా, చదివినా స్మార్ట్ ఫోన్లలో వాడే యాప్స్‌తో ఎంత ప్రమాదమో అర్థం అవుతుంది. మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలోకి స్పైవేర్ (CERT-In on Spyware) చొచ్చుకొచ్చిందని, ఇది మన వ్యక్తిగత సమాచారం, ఈ-మెయిల్స్ డేటాతోపాటు ఫోన్ కెమెరా సాయంతో రికార్డు చేసి తమకు అవసరమైన వారికి చేరవేస్తుందీ స్పైవేర్.. దీని పేరు ‘స్పిన్ ఓకే’ (Spine OK). మనం ఇండ్లలో ఫోన్ పెట్టేసి పనులు చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతున్నది. మనం ఏం మాట్లాడుకుంటున్నది మొత్తం ఫోన్ రికార్డు చేసేస్తుంది. అంతటి సామర్థ్యం గల ఈ స్పైవేర్ దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలోకి చొచ్చుకొచ్చిందని సెర్ట్-ఇన్ నివేదిక సారాంశం. గూగుల్ ప్లే స్టోర్స్‌లోని 105 యాప్స్ ద్వారా సదరు స్పైవేర్ మన ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడిందని కూడా సెర్ట్-ఇన్ తేల్చి చెప్పింది.

YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్, 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే మానిటైజేషన్‌, వాచ్‌ అవర్స్‌ కూడా 3వేలు గంటలకు తగ్గింపు 

ఆన్ లైన్ క్యాష్ రివార్డ్స్, గేమ్స్ (Games), ఫిట్ నెస్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, నాయిస్ వీడియో ఎడిటర్, జాప్యా, బైగో ఎంవీ బిట్, క్రేజీ డ్రాప్స్, టిక్, వుయ్ ఫ్లై, క్యాష్ జాయిన్ (Cash Join), క్యాష్ ఈఎం, ఫిజ్జో నావెల్ వంటి యాప్స్‌లో ‘స్పిన్ ఓకే’ ఎంటరైంది. జాప్యా, నాయిస్ వీడియో ఎడిటర్ 10 కోట్లు, బైగో (Bigo), ఎంవీ బిట్ (MV Bit), వీ ఫ్లయ్ యాప్స్ ఐదు కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నాయి. దేశ భద్రతకు, జాతి ప్రయోజనాలకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ కాకుండా అనుమానాస్పద యాప్స్ అన్నీ మొబైల్ ఫోన్ల నుంచి డిలిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలు, మంత్రుల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp New Feature: వాట్సప్‌లోకి కొత్త ఫీచర్, వీడియో కాల్స్ కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేసిన మెసేజింగ్ దిగ్గజం 

ఈ ‘స్పిన్ ఓకే’ స్పై వేర్ (CERT-In on Spyware) అడ్డుకోవడానికి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్, వెబ్ సైట్‌లో వచ్చే అడ్వర్టైజ్ మెంట్లు క్లిక్ చేయొద్దు. ఈ-మెయిల్ కి వచ్చే అన్ నోన్ లింక్స్ కూడా క్లిక్ చేయవద్దు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నప్పుడు అందులో ఏముందో చదవాలి. యాప్ అదనపు సమాచారం కోసం సెర్చింగ్ చేయాలి. వెబ్ సైట్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అప్ డేట్ చేసుకోవాలి.