World
Harnaaz Sandhu Emotional Video:స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న మాజీ విశ్వసుందరి హర్నాజ్‌ సంధు, బొన్ని గాబ్రియేల్‌కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగిన భారత్ అందగత్తె
Hazarath Reddyవిశ్వ సుందరి పేరును ప్రకటించేటప్పుడు స్టేజ్‌పైకి వచ్చిన హర్నాజ్‌.. మిస్‌ యూనివర్స్‌ హోదాలో చివరిసారిగా ర్యాంప్‌పై వాక్‌ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ర్యాంప్‌ వాక్‌ చేస్తూ కిందపడిపోబోయింది. అనంతరం తిరిగి ఆమె వాక్‌ కొనసాగించింది.
Nepal Plane Crash: నేపాల్ విమానం మంటల్లో బూడిదయ్యే సెకన్ల ముందు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారతీయ ప్రయాణికుడు తీసిన వీడియో
Hazarath Reddyనేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం (Pokhara Airport) సమీపంలో యతి ఎయిర్‌లైన్స్‌కు (Yeti Airlines) చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలి 72 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయిన సంగతి విదితమే.ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
KTR In Davos: నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు.. దావోస్ చేరుకున్న కేటీఆర్
Rudraస్విట్జర్లాండ్‌లో జరగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు వారి నుంచి ఘన స్వాగతం లభించింది.
Pakistan Food Crisis: పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో పౌరుల ఛేజింగ్.. వైరల్ వీడియో
Rudraపాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం కట్టలు తెంచుకున్నది. కడుపు నింపుకునేందుకు పౌరులు పడరాని పాట్లు పడుతున్నారు. గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కును చూసిన వందలాదిమంది పిండిని కొనుగోలు చేసేందుకు దానిని బైకులతో వెంబడించారు.
Nepal’s Plane Crashes History: గడిచిన 12 ఏళ్లలో 11 విమాన ప్రమాదాలు, నేపాల్‌లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు, ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరిగాయంటే?
VNSనేపాల్‌లో (Nepal plane crash) విమాన ప్రమాదాలు జరగడం ఇదే కొత్తేమీ కాదు. 2010 నుంచి గత 12 ఏండ్లలో 11 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన పదేళ్లలో అనేక విమాన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు
Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ప్రమాద సమయంలో విమానంలో 72 మంది, 5గురు భారతీయులు సహా మొత్తం 15 మంది విదేశీయులు
VNSనేపాల్‌(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
Viral News: ముగ్గురు భార్యలతో 60 మంది పిల్లలను కన్నాడు, అయినా తనివి తీరలేదట, నాలుగో పెళ్లికి రెడీ అంటున్నాడు, ఎవరో ఎక్కడో తెలిస్తే షాక్ తింటారు..
kanhaపాకిస్తాన్‌లోని 50 ఏళ్ల సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ ఏకంగా 60 మంది పిల్లల తండ్రిగా మారి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాడు. క్వెట్టా ప్రావిన్సు వాసి అయిన ఖిల్జీ ఓ సామాన్య బస్సు డ్రైవర్. ముగ్గురు భార్య ముద్దుల మొగుడైన ఖిల్జీకి ఇప్పటికే 59 మంది సంతానం ఉన్నారు.
China Road Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, పాదాచారులపైకి దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు, 5గురు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyచైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై బ్లాక్‌ బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. సౌత్‌ చైనాలోని గ్వాంగ్‌జూ ప్రావిన్స్‌లోని సిగ్నల్‌ కూడలి వద్ద బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది
UPI on International Numbers for NRIs: ఎన్ఆర్ఐలకు అదిరిపోయే న్యూస్, విదేశాల్లో ఉన్నా వారు యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు, అయితే ఈ పది దేశాలలో మాత్రమే సాధ్యం
Hazarath Reddyవిదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) శుభవార్త చెప్పింది. NRIలు తమ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ (International Mobile Numbers) ద్వారా యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ (UPI on International Numbers for NRIs) ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ ప్రకటించింది.
WHO Alert On 2 Indian Syrups: దగ్గుమందు వాడుతున్నారా? ఈ రెండు కంపెనీల సిరప్‌లు వాడితే డేంజర్‌లో పడ్డట్లే, విషపూరిత ఇథిలీన్ ఉన్నట్లు ప్రకటించిన డబ్లూహెచ్‌వో
VNSభారత్‌లో తయారైన రెండు దగ్గు సిరప్‌లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్‌ గ్లైకాల్‌ (diethylene glycol) లేదా ఇథిలీన్‌ ఉన్నట్లు నిర్ధారించింది. దేశంలోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్‌ సిరప్‌, అంబ్రోనల్‌ సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది.
Moscow-Goa Flight Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు కాల్, వేగంగా స్పందించిన భారత వాయుసేన, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
Hazarath Reddyమాస్కో (Moscow) నుంచి గోవా (Goa)కు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు కారణంగా గుజరాత్‌ (Gujarat)లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే.విమానంలో 236 మంది ప్రయాణికుల ప్రాణాలు ఈ బెదిరింపు కాల్‌తో ప్రమాదంలో పడ్డాయి.
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, రూ. 220కు చేరిన కిలో ఉల్లిపాయలు, రూ.150కి చేరిన పాల ధరలు, ముందుముందు మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం
Hazarath Reddyపాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం (Pakistan Economic Crisis) దాల్చుతోంది. నిత్యావసరాలు ధరలు నింగిని తాకుతున్నాయి. ఒక లీటర్‌ పాల ధర (Milk Price) రూ.150కి చేరింది. 2021 జనవరిలో కిలో రూ.36గా ఉన్న ఉల్లిగడ్డ (Onion Price)ధర 2022 జనవరిలో రూ.220కి చేరింది
Afghanistan Blast: తాలిబన్ రాజ్యం కాబూల్‌లో భారీ పేలుడు, 20 మంది మృతి చెందినట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించన తాలిబన్ ప్రభుత్వం
Hazarath Reddyఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.ఆఫ్ఘాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనంలో తాలిబాన్‌-చైనా అధికారుల మధ్య సమావేశం జరుగుతున్నప్పుడు వెలుపల ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వశాఖగానీ, అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖగానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
California Floods: భారీ వరదలతో వణుకుతున్న అమెరికా, జలదిగ్భంధంలో చిక్కుకున్న కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు వణికిస్తున్నాయి.దేశంలోని కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
FAA Outage: యుఎస్ ఏవియేషన్ సిస్టం డౌన్, అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న ప్రయాణికులు
Hazarath Reddyఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా సిస్టమ్ అంతరాయాన్ని ఎదుర్కొన్న తరువాత యునైటెడ్ స్టేట్ అంతటా విమానాలు నిలిపివేయబడ్డాయి, దీనివల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా సిస్టమ్ లోపాన్ని ఎదుర్కొన్నందున ప్రయాణికులు లైన్లలో వేచి ఉన్నారు.
Live Bomb Inside Body: సైనికుడి శరీరంలో లైవ్ బాంబ్, ఏ క్షణమైనా పేలే అవకాశం, జవాన్ల సమక్షంలో శస్త్రచికిత్స ద్వారా బాంబును తొలగించిన వైద్యులు
Hazarath Reddyఉక్రెయిన్ సైనికుడు అదృష్టవశాత్తూ అతని శరీరం నుండి లైవ్ గ్రెనేడ్‌ను తొలగించడానికి వైద్యులు విజయవంతమైన ఆపరేషన్ చేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఉక్రెయిన్‌లోని బఖ్‌ముట్‌లో జరిగిన క్రూరమైన యుద్ధంలో సైనికుడి శరీరంలో బాంబు ప్రవేశించింది.
Henley Passport Index 2023: ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌లలో అత్యంత శక్తివంతమైనది జపాన్ పాస్‌పోర్ట్, 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తున్న ఏకైక దేశం
Hazarath Reddyహెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం, వరుసగా ఐదవ సంవత్సరం, జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోని అన్ని పాస్‌పోర్ట్‌లలో అత్యంత శక్తివంతమైనది, ఎందుకంటే ఇది 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అనుమతిస్తుంది. మరోవైపు భారతదేశం దాని మెరుగుపడింది. గత సంవత్సరం కంటే 2 స్థానాలతో స్థానం పొందింది. ప్రస్తుతం ఇండెక్స్‌లో 85వ స్థానంలో ఉంది.
Pakistan Crisis: పాక్ హోం మంత్రి కారుపై షూ విసిరిన అగంతకుడు, అసెంబ్లీని వదిలి వెళుతుండగా ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyపంజాబ్ అసెంబ్లీ లోపల వాగ్వివాదాలు కొనసాగుతుండగా, శాసనసభ వెలుపల హోం మంత్రి రాణా సనావుల్లా వాహనం అద్దాలపై మంగళవారం షూ విసిరారు. సంఘటన జరిగినప్పుడు, మంత్రి ముందు ప్యాసింజర్ సీటులో కూర్చొని ఉన్నారు.
Golden Globes 2023: భారతీయ సినిమాను తల ఎత్తుకునేలా చేశారు, ఆర్ఆర్ఆర్ టీంకు ప్రధాని మోదీ అభినందనలు, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్‌
Hazarath Reddyబెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా RRR Teamకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంగీతకర్త కీరవాణికి, పాట పాడిన గాయకులకు, హీరోలకు , దర్శకులకు అభినందలు తెలియజేస్తూ వారిని ట్యాగ్ చేశారు.
RRR in Chinese Theaters: చైనాలో తెలుగు సినిమా ఊపు, నాటు నాటు సాంగ్ పాటకు థియేటర్లో స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్సులేసిన చైనీయులు
Hazarath Reddyగత రాత్రి, #RRRMovie చైనీస్ థియేటర్ స్క్రీనింగ్‌లోని ప్రేక్షకులు "నాటు నాటు" సమయంలో నృత్యం చేయడానికి వేదికపైకి వచ్చారు. అక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ రోజు, స్వరకర్త M. M. కీరవాణి ఉత్తమ ఒరిజినల్ పాటగా దీనికే గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకున్నారు. నాటు నాటు పాటకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది.