New york, September 27: దాయాది దేశం పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పాకిస్తాన్ ఆర్థికంగా డేంజ్ జోన్ లోకి వెళుతుందంటూ యుఎన్ఓ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. మనదేశంపై ఎప్పుడు దండయాత్ర చేద్దామా అని కాచుకూర్చున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని యుఎన్ఓ వార్షిక నివేదిక (annual flagship report)లో తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మరి కొన్ని నెలలు కొనసాగితే ఇక కోలుకోలేనంతగా ఆర్థిక ఊబిలో చిక్కుకుపోవడం ఖాయమని ఆసియా దేశాల్లో వాణిజ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వార్షిక నివేదిక తెలిపింది. ఐక్యరాస్యసమితి విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఆసియా దేశాల్లో చైనా ఎకనామి కూడా 2017 నుంచి డౌన్ అవుతూ వస్తోందని, దీనికి ప్రధాన కారణం 2019లో ఏర్పడిన టెక్నాలజీ ఉద్రిక్తతలే కారణమని తెలిపింది. కాగా అమెరికాకు , చైనాకు ఆ మధ్య టెక్నాలజీ పరంగా వాణిస్య పోరు నడిచిన సంగతి విదితమే. ఈ ప్రభావం చైనా ఎకానమి మీద పడిందని రిపోర్ట్ తెలిపింది. ఇండియా విషయానికి వస్తే మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీ ప్రభావం ఇండియా మీద పడిందని ఇండియా ఎకానమి కొంచెం ప్రతికూల ఫలితాలను చూపిందని రిపోర్ట్ తెలిపింది.
దారుణంగా పడిపోయిన పాకిస్తాన్ కరెన్సీ
ప్రధానంగా పాకిస్తాన్ లో ఆర్థికంగా నెలకొన్న దుర్భర పరిస్థితులను ఈ నివేదిలో స్పష్టంగా వివరించింది. చైనా, సౌదీ అరేబియా సహా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకున్న తరువాత కూడా ఆ దేశ ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా ఎలాంటి మార్పూ కనిపించలేదని తన నివేదికలో పొందుపరిచింది. ఈ ఏడాది కాలంలో పాకిస్తాన్ కరెన్సీ విలువ అంతర్జాతీయ డాలర్ తో పోల్చుకుంటే దారుణంగా క్షీణించిందని, దీని ప్రభావం ఆ దేశ ఎగుమతి, దిగుమతి విధానాలపై చూపిందని పేర్కొంది. బయటి దేశాల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీల రూపంలో చెల్లించే మొత్తాలే తడిసి మోపెడవుతున్నాయని, ఈ గండం నుంచి గట్టెక్కడానికి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తక్షణ చర్యలకు దిగక తప్పదని, కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఆసియా దేశాల్లో భారత్, చైనాల పనితీరు కూడా అంతంత మాత్రమేనని వెల్లడించింది.
ఇండియాపై జీఎస్టీ దెబ్బ
2019 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించిందని పేర్కొంది. భారత్ లో కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానం వల్ల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గాయని ఈ నివేదికలో స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు క్రయ విక్రయాలు జోరుగా సాగినప్పటికీ.. పన్నుల విధానంలో మార్పులను తీసుకొచ్చిన తరువాత ప్రజలు పొదుపునకు అలవాటు పడినట్లు స్పష్టం చేసింది. కాగా ఇండియాపై యుధ్ధానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని నివేదిక తెలిపింది.
డిజిటలైజేషన్‌లో ఇండియా 48వ ర్యాంకునుంచి 44వ ర్యాంకుకు..
ఇదిలా ఉంటే డిజిటలైజేషన్‌లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ ముందుకెళుతోంది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఉన్న 48వ ర్యాంకునుంచి 44వ ర్యాంకుకు ఎగబాకింది. ప్రధానంగా ఆధునిక డిజిటల్ సాంకేతికలను అందిపుచ్చుకుని అభివృద్థి చెందేందుకు అనుగుణంగా విజ్ఞానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను సమకూర్చుకుంటోందని ‘ఐఎండీ వరల్డ్ డిజిటల్‌నెస్ ర్యాంకింగ్ 2019’ (డబ్ల్యుడీసీఆర్) అధ్యయన నివేదిక పేర్కొంది. 2018లో ఉన్న 44వ ర్యాంకు నుంచి ఈఏడాది 48కు భారత్ చేరుకుందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ పోటీ పటిమ కలిగిన దేశంగా అమెరికా గణుతికెక్కింది. తర్వాతి స్ధానాల్లో సింగపూర్, సీడన్ దేశాలున్నాయి. అలాగే డెన్మార్క్ 4, స్విడ్జర్లాండ్ 5వ ర్యాంకుల్లో ఉన్నాయి. అలాగే టాప్‌టెన్ దేశాల్లో నెదర్లాండ్, ఫిన్‌ల్యాండ్, హాంగ్‌కాంగ్, నార్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉన్నాయి. చైనా సైతం 30వ స్థానం నుంచి 22వ స్థానానికి చేరుకోగా, ఇండోనేషియా 62వ స్థానం నుంచి 56 స్థానానికి చేరింది. కాగా చైనా విజ్ఞానపరంగా 18వ ర్యాంకులో ఉంది. శిక్షణ, బోధన పరంగా 46 నుంచి 37వ ర్యాంకుకు చేరింది. వైజ్ఞానిక శాస్త్ర విస్తరణలో 21 నుంచి 9వ ర్యాంకుకు చేరిందని నివేదిక వివరించింది. అలాగే ఆసియా ఖండంలో తైవాన్ సైతం 22వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకుకు వృద్ధి చెందని తెలిపింది. ఈ దేశాల్లో సమర్థత, శిక్షణ, బోధన, సాంకేతికాభివృద్ధికి అవసరమైన వౌలిక వసతులు పెరిగాయని ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్ డైరెక్టర్ ఆర్టురోబ్రిస్ ఈ సందర్భంగా తెలిపారు.
కరేబియన్ దేశాల కూటమికి మోడీ భారీ నజరానా
ప్రధాని నరేంద్ర మోడీ కరేబియన్ దేశాల కూటమి(Caribbean Island states)కి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం 14 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను ప్రకటించారు. అలాగే సౌర, సంప్రదాయేతర ఇంధన వనరులు, వాతావరణ మార్పులకు సంబంధించిన పనులకుగాను మరో 150 మిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని కూడా ఆయన ప్రకటించారు. గయానాలో తొలిసారిగా జరిగిన భారత్ కారికామ్ దేశాల నేతల సమావేశంలో మోడీ ఈ ప్రకటన చేశారు. కరేబియన్ దేశాలతో భారత్‌కున్న సహృద్భావ సంబంధాలకు ఈ సమావేశంతో కొత్త ఊపు లభించిందని సమావేశంలో మోడీ అన్నట్లు ఒక అధికార ప్రకటన పేర్కొంది. 74వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశం నేపథ్యంలో జరిగి న ఈ సమావేశానికి ప్రస్తుతం ‘కారికామ్’ చైర్మన్ కూడా అయిన సెయింట్ లూసియా ప్రధాని అల్లెన్ చాస్టెంట్ మోడీతో పాటుగా అధ్యక్షత వహించారు.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్
1st ever India-Caricom Leaders' Meeting captured in a frame!
Underscoring our historic & warm ties with Caribbean countries, PM @narendramodi is hosting the India-CARICOM Leaders’ Meeting on the margins of #UNGA. Leaders or the representatives of 14 Caribbean countries attending pic.twitter.com/XfF3kqIX8M
— Raveesh Kumar (@MEAIndia) September 25, 2019
గయానాలోని జార్జిటైన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక రీజనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ దేశంలో పాటుగా బెలిజేలో ప్రస్తుతం భారత ఆర్థిక సాయంతో నడుస్తున్న వృత్తివిద్యా కేంద్రాలను అప్‌గ్రెడ్ చేయడానికి బెలిజేలో ఒక ప్రాంతీయ వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ‘కారికామ్’గా పిలవబడే కరేబియన్ దేశాల కూటమిలో 15 దేశాలు సభ్యలుగా ఉండగా మరో అయిదు దేశాలు అనుబంధ సభ్యులు గా ఉన్నాయి. గయానాలో జరిగిన సమావేశానికి ఆంటి గ్వా, బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలిజే, డొమినికా,గ్రనెడా, గయానా, హౌతీ, జమైకా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెం ట్, గ్రెనడినెస్, సురినామె, ట్రినిడాడ్, టొబాగో దేశాలకు చెందిన అగ్రనేతలు, ప్రతినిధులు హాజరైనారు.