Entertainment

Chaitu & Akhil’s Weddings: కొడుకులు పెళ్లిళ్లు ఒకరోజుపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున, డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య పెళ్లి, అఖిల్ పెళ్లి ఎప్పుడంటే..

Hazarath Reddy

నాగ చైతన్య అక్కినేని, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తమ్ముడు అఖిల్ నిశ్చితార్థం కూడా కొద్ది రోజుల క్రితం జరిగింది. దీంతో చై, అఖిల్ ఒకే రోజు పెళ్లి చేసుకుంటారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Konidela Klinkaara: రామ్‌చరణ్ - ఉపాసన ముద్దుల కుమార్తె క్లీంకార వీడియో వైరల్, బుడిబుడి అడుగులేసిన మెగా డాటర్

Arun Charagonda

రామ్‌ చరణ్.. ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకారకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో క్లీంకార నడవటం మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్.. తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ వచ్చే ఏడాది 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RGV: నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ

Arun Charagonda

తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.

Pushpa Re-Release: కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

VNS

రీరిలీజ్‌ ట్రెండ్‌లో కరణ్‌ అర్జున్‌, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్‌ ఖాన్‌ 'కల్‌ హో నా హో' (Kal Ho Na Ho) సినిమా కూడా నవంబర్‌ 15న రీరిలీజ్‌ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.

Advertisement

Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్ట‌కేల‌కు ఆ స్టార్ క‌పుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చ‌ట్ట‌ప‌రంగా తెర

VNS

తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.

Allu Arjun Craze in Kerala: కేర‌ళ‌లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మ‌తి పోవాల్సిందే! మ‌ల్లు అర్జున్ అంటూ వెలిసిన పోస్ట‌ర్లు, వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ఫ్యాన్స్

VNS

ఐకాన్ స్టార్‌కు (Icon Star) తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చి లివా మాల్‌లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జ‌రిగింది.

Ram Gopal Varma: సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అందరూ జైల్లోనే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్​ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్​ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.

Ram Charan's New Look from RC 16: RC 16 చిత్రం నుంచి రా చంరణ్ కొత్త లుక్ వచ్చేసింది, ఎలా ఉందో మీరే చూసి చెప్పండి

Hazarath Reddy

RRR స్టార్ రామ్ చరణ్ త్వరలో శంకర్ గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే, రామ్ తన తదుపరి చిత్రానికి ప్రస్తుతం RC 16 అనే టైటిల్‌ను సిద్ధం చేయడం ప్రారంభించాడు. రామ్ త్వరలో బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించనున్నాడు.

Advertisement

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

Arun Charagonda

పాయల్ కపాడియా దర్శకత్వంలో కనికా కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ '. నవంబర్ 22న టాలీవుడ్ హీరో రానా - స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగం చేస్తుంటారు. ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది అన్నదే సినిమా కథ.

Pushpa Actor Shri Tej: పుష్ప నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

పుష్ప నటుడు శ్రీతేజ్‌ (Sritej)పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్‌ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Yash:అభిమానుల మనసు గెలుచుకున్న యష్, టాక్సిక్ షూటింగ్‌లో అభిమానులతో సెల్ఫీ...అభిమాని కాళ్లు మొక్కబోతుంటే ఏం చేశాడో తెలుసా?

Arun Charagonda

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌తో మారిపోయారు యష్. ప్రస్తుతం తన 19వ ప్రాజెక్టును దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ మాత్రం తన అభిమానులతో ఇట్టే కలిసిపోతారు. ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో సెల్ఫీకి టైం కేటాయిస్తున్నారు. అలాగే తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వీధుల్లోతరచూ దర్శనమిస్తున్నారు యష్.

Keerthy Suresh : కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్‌, 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్

Arun Charagonda

తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది నటి కీర్తి సురేశ్‌. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆంటోనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. 15 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని...ఇద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. AntoNY x KEerthy ( Iykyk) అని పోస్ట్ లో పేర్కొంది. డిసెంబర్ 11, 12 తేదీలలో వీరిద్దరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Tirupati: శ్రీవారి సేవలో నటి జ్యోతిక, సుప్రభాత సేవలో స్వామివారికి మొక్కలు చెల్లించిన జ్యోతిక...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల...శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నటి జ్యోతిక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.

RGV: భయపడేది లేదు...రాజకీయ నాయకులకు ఆయుధంగా పోలీసులు, హత్య కేసులకు సంవత్సరాలు..ఈ కేసుకేమో అర్జెంటా..వీడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ

Arun Charagonda

రాజకీయ నాయకులకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు దర్శకుడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఏపీలో కేసు నమోదుకాగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ఈ కేసులకు తానేం భయపడటం లేదహత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.

Actor Subbaraju: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు, భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టాలీవుడ్ నటుడు

Arun Charagonda

ప్రముఖ సినీ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడయ్యాడు. 47 ఏళ్ల లేటు వయస్సులో వివాహం చేసుకున్నారు సుబ్బరాజు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. పెళ్లి గురించిన ఆలోచన లేదని చెబుతూ వచ్చిన సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్‌గా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెళ్లికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

Tollywood: సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్..చికిత్స పొందుతూ మృతి

Arun Charagonda

టాలీవుడ్ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కులశేఖర్ గతంలో మందుకు బానిసై, మానసిక స్థితిని కోల్పోయి.. దొంగగా మారి, పోలీసుల చేతికి చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

Akhil Akkineni Engagement: జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున

Arun Charagonda

అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతుండగా తాజాగా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగ్.. మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రావడ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారగా అంతా షాక్‌కు గురవుతున్నారు.

Tollywood Actor Shritej: నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు..కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

Arun Charagonda

యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయగా కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయింది. గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయం తెలిసి గుండెపోటుతో మృతిచెందారు మహిళ భర్త. మాదాపూర్‌ పీఎస్‌లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఓ సినిమాలో చంద్రబాబుగా నటించారు శ్రీతేజ్.

Andhra Pradesh: రామ్‌గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు, హైదరాబాద్-తమిళనాడులో విస్తృత గాలింపు..

Arun Charagonda

ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. రెండుసార్లు విచారణకు హాజరుకాలేదు ఆర్జీవీ. దీంతో హైదరాబాద్, తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ కోసం గాలిస్తుండగా ఈ నెల 23న కోయంబత్తూరు లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫొటోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు పోలీసులు.

Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement