సినిమా

Director Sankaran Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు భారతీరాజా గురురు డైరక్టర్ ఆర్.శంకరన్ కన్నుమూత

Hazarath Reddy

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్.శంకరన్ 93 సంవత్సరాలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shreyas Talpade: షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి గుండెపోటు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శ్రేయాస్‌ తల్పాడే (Shreyas Talpade) (47) ముంబైలో షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు

Guntur Kaaram: ఓ మై బేబీ లిరికల్‌ సాంగ్‌ ట్రోల్, సోషల్‌ మీడియా కుక్కల చేతిలోకి వెళ్తోంది, ప్రతివాడు మాట్లాడేవాడే అంటూ రామజోగయ్య శాస్త్రి ఫైర్

Hazarath Reddy

Salaar First Single: 'సలార్' ఫస్ట్ సింగిల్ రిలీజైంది.. ఎలా ఉందో చూడండి..

ahana

అభిమానుల, సాధారణ ప్రేక్షకుల నుండి భారీ అంచనాల మధ్య 'సూరీడే..' అనే 'సాలార్' పాటను ఈ రోజు విడుదల చేశారు. సినిమాలోని ప్రధాన పాత్రల నేపథ్యాన్ని లోతును వివరిస్తూ, ఈ పాట సిట్యుయేషనల్ మాంటేజ్ తో విడుదల అయ్యింది.

Advertisement

Guntur Kaaram Oh My Baby Song: ఓమై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న గుంటూరు కారం

Hazarath Reddy

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur kaaram) నుంచి తాజాగా సెకండ్‌ సింగిల్‌ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు

Most Searched Movies 2023: షారుక్ ఖాన్ కు తెగ క‌లిసి వ‌చ్చిన 2023, గూగుల్ సెర్చ్ తో బాలీవుడ్ బాద్ షా హ‌వా, ఈ సంవ‌త్స‌రం నెటిజ‌న్లు తెగ వెతికిన టాప్-10 సినిమాలివే!

VNS

బాలీవుడ్‌కు ఎప్పటికీ తానే బాద్‌షా అని నిరూపించుకున్నాడు. తాజాగా గూగుల్‌ విడుదల చేసిన టాప్‌-10 చిత్రాల జాబితా కూడా అదే వెల్లడించింది. అందుకే ఈ ఏడాది షారుక్‌ నటించిన రెండు సినిమాలు కూడా టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Most Searched Movies 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవిగో, టాప్ ప్లేస్‌లో షారుక్‌ కాన్ జవాన్

Hazarath Reddy

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ 2023 సంవత్సరంలో ఎవరెవరు ఏమేమీ వెతికారు? ఏ అంశాల గురించి సెర్చ్‌ చేశారనే విషయాలను వరుసగా వెల్లడిస్తున్నది. తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది

Guntur Kaaram Update: గుంటూరు కారం నుంచి లేటెస్ట్ అప్‌డేట్, అమ్ము.. ర‌మ‌ణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ అంటూ సాగే ప్రోమో సాంగ్ విడుదల

Hazarath Reddy

గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ ప్రోమోను చిత్రబృందం విడుద‌ల చేసింది. ”అమ్ము.. ర‌మ‌ణ గాడు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది.. ఓ మై బేబీ” అంటూ ఈ ప్రోమో సాగింది. ఇక ఈ సాంగ్ చూస్తే.. రొమాంటిక్ మెలోడి అని తెలుస్తుంది. ఈ పాటను శిల్పా రావు ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

Advertisement

Salaar First Single Sooreede Song: సలార్ ఫస్ట్‌ సింగిల్‌ సూరీడే సాంగ్ అప్‌డేట్ ఇదిగో, తన స్నేహితుడు చేయి పట్టుకుని సలార్ తీసుకువెళుతున్నట్లుగా సాంగ్

Hazarath Reddy

డార్లింగ్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న చిత్రం సలార్‌ (Salaar). కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

Vettaiyan Teaser: ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌, రజనీకాంత్ కొత్త మూవీ వెట్టయన్ టీజర్ ఇదిగో, గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్

Hazarath Reddy

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తలైవా 170 (Thalaivar 170) టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.

Devil Trailer Out: కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ఇదిగో, విశ్వాసంగా ఉండడానికి,విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా...లయన్ అంటూ మీసం మెలేసిన నందమూరి నట వారసుడు

Hazarath Reddy

బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది.

Chiranjeevi Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి, సినిమా పరిశ్రమ గురించి అడిగారని తెలిపిన మెగాస్టార్

Hazarath Reddy

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను..మెగాస్టార్ చిరంజీవి సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు.

Advertisement

Bachchan Family Row: కోడలు ఐశ్వర్య రాయ్‌ ను అన్‌ ఫాలో అయిన అమితాబ్.. ఆశ్చర్యంలో అభిమానులు

Rudra

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ ను ఇన్‌స్టా లో అన్‌ ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు.

Defamation on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, న‌టి త్రిష‌పై పరువు న‌ష్టం దావా వేసిన మ‌న్సూర్ అలీ, రేప్ వ్యాఖ్య‌ల‌పై యూట‌ర్న్ తీసుకున్న త‌మిళ‌న‌టుడు, ఈ నెల 11న దావాపై విచార‌ణ‌

VNS

పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ పంచాయితీ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ఈ వివాదం మ‌గిసింది.. అంతా అయిపోయింది

Kannada Actress Leelavathi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ కన్నడ నటి లీలావతి మృతి

Hazarath Reddy

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

Rajinikanth's House in Floods: వరదల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు ఎలా మునిగిపోయిందో వీడియోలో చూడండి, ఇంటి బయట భారీగా వరద నీరు

Hazarath Reddy

ప్రముఖ స్టార్‌ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

Advertisement

Junior Mehmood No more: మరాఠీ నటుడు జూనియర్ మహమూద్ మృతి.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో కన్నుమూత

Rudra

మరాఠీ నటుడు, నిర్మాత జూనియర్ మహమూద్ (67) మృతి చెందారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన కన్నుమూశారు. మహమూద్ అసలు పేరు నయీం సయ్యద్. 250కు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించారు.

Pushpa Actor Arrest: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య, పుష్ప సినిమా నటుడు జగదీష్‌ ప్రతాప్‌ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు

Hazarath Reddy

జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ ప్రతాప్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ వివరాల్లోకెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

Priyanka Chopra Deepfake: వీడియో ఇదిగో, ఈ సారి డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన ప్రియాంక చోప్రా, నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో

Hazarath Reddy

డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్‌ సరసన తాజాగా ప్రియాంక చోప్రా చేరింది. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది.

Prabhas Gold Watch Gift To Teacher: వీడియో ఇదిగో, గురువు ఇంటికి వెళ్లి గోల్డెన్‌ వాచ్ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌, ఇది నిజమైన బంగారం అంటూ..

Hazarath Reddy

తనకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు సత్యానంద్‌కు ప్రభాస్ బంగారు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. సత్యానంద్‌ పుట్టినరోజు పురస్కరించుకుని తన ఇంటికి వెళ్లి బంగారు వాచ్‌ను గురువు చేతికి తొడిగి మరీ సంతోషించాడు. 'ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడ పడితే అక్కడ పడేయకండి' అని కోరాడు

Advertisement
Advertisement