జాతీయం

Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, విద్యార్థినులపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటో షూట్‌ పేరుతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి..విద్యార్థినుల ఆందోళన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫోటోషూట్ పేరుతో విద్యార్థినులను బయటకు తీసుకెళ్లి హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారాలకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Bengaluru Metro Station: బెంగళూరు మెట్రో స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్మ యత్నం, మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రమాదం...వీడియో

Arun Charagonda

బెంగళూరులోని మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యుకవుడు. మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపాడు ఆ యువకుడు.

Stray Dog ​​Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి, తీవ్ర గాయాలు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

Arun Charagonda

కడప జిల్లా కమలాపురంలో నాయి బ్రహ్మణ కాలనీలో కలకలం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయలు కాగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

KTR on CM Revanth Reddy: ఢిల్లీ బాసుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే ప‌నిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, సెటైర్ వేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూట‌ర్ల‌ను క‌నిపెట్ట‌డం, మ‌ళ్లీ వాటిని ఆవిష్క‌రించ‌డంలో సీఎం బిజీగా ఉన్నార‌ని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

Advertisement

New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నేచంద్రబాబు సర్కారు తిరిగి ప్రవేశపెట్టనునుంది. ఈ కొత్త పాలసీ ద్వారా (New Liquor Policy in AP) మద్యం రిటైల్‌ వ్యాపారం (Retail liquor outlets) మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, పేషెంట్ నుంచి రూపాయి అధికంగా వసూలు చేశాడని ఉద్యోగం నుంచి తీసేసిన అధికారులు, ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న వీడియో వైరల్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

Clash In Jagtial BJP: జగిత్యాల బీజేపీలో వర్గపోరు, వినాయక నిమజ్జనం సందర్భంగా కొట్టుకున్న బీజేపీ నేతలు..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లా బీజేపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా జగిత్యాలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణికి నిమజ్జన కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రావణిని అడ్డుకున్నారు బీజేపీ నేత ముదుగంటి రవీందర్ రెడ్డి. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Ganesh Visarjan 2024: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లో గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.

Advertisement

Andhra Pradesh: రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

Arun Charagonda

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగానే డాక్టర్లు ఆమె తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు.

Poonam Kaur on Trivikram: జానీ మాస్టర్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ వంతు, తనను అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ పూనమ్ కౌర్ ట్వీట్, ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది.

Ganesh Visarjan 2024: వీడియో ఇదిగో, డ్రోన్‌తో బాల గణపతి విగ్రహం నిమజ్జనం, పోలీసులు అనుమతించకపోవడంతో కొత్తగా ఆలోచించిన కడియపు లంక చిన్నారులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు.

Telangana Arogya Mithras Strike: తెలంగాణలో సమ్మెకు దిగిన ఆరోగ్య మిత్ర సిబ్బంది, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్

Arun Charagonda

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం. 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే వెంటనే విధుల్లో చేరుతామని తెలిపారు.

Advertisement

Bengaluru Shocker: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నగ్నంగా శత్రువును పరిగెత్తించిన రౌడీ షీటర్, అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కడుబు అనే పేరుమోసిన రౌడీ షీటర్ అయిన పవన్ గౌడను ఈ తెల్లవారుజామున బెంగళూరు సిటీ పోలీసులు పారిపోయే ప్రయత్నంలో కాల్చారు. ఇటీవల తన ప్రత్యర్థిని నగ్నంగా చేసి వీధుల్లో పరుగెత్తించండంతో పాటుగా గౌడ పలు నేరాలకు పాల్పడ్డాడు.

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొట్టుకున్న ఇరువర్గాలు, 17 మందికి గాయాలు, అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి...వీడియో

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. క్రిస్టియన్ పేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా 17 మందికి గాయాలు అయ్యాయి. అడ్డుకోవటానికి వెళ్ళిన కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Jammu Kashmir Assembly Election: పదేళ్ల తర్వాత ఎన్నికలు, జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్, ఆనందం వ్యక్తం చేస్తున్న ఓటర్లు, ఓటు వేయనున్న కశ్మీరి పండిట్లు

Arun Charagonda

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఏడు గంటలకే తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

SI Suicide Attempt: వీడియో ఇదిగో.. న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడబోయిన ఎస్సై..ఎక్కడంటే..!

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో తనపై న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించాడని ఆవేదన చెందిన ఓ ఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం SI కోర్టులో హాజరుపర్చగా నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement

New UPI Fraud: కొత్త తరహా యూపీఐ మోసం, పొరపాటున యూపీఐకి డబ్బు వచ్చిందని మెస్సేజ్, తిరిగి పంపించామో అంతే..పోలీసుల అలర్ట్

Arun Charagonda

రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసరుతునే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో రూపంలో క్రైమ్‌కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొత్త తరహా యూపీఐ మోసానికి తెరలేపారు. పొరపాటున గూగుల్ పే కి కొంత డబ్బు వచ్చిందంటూ అమౌంట్ నంబర్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు.

Hyderabad Ganesh Immersion: లక్షకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించిన జీహెచ్‌ఎంసీ, అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులోనని వెల్లడి, ప్రశాంతంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం

Arun Charagonda

తెలంగాణలోని జంట నగరాలైన సికింద్రాబాద్ - హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఇక ఇప్పటివరకు 1లక్ష 2510 గణనాధులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

Pagers Explode: లెబనాన్‌లో పేలిన పేజర్లు, 9 మంది మృతి..2800 మందికి పైగా గాయాలు, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రకటన

Arun Charagonda

లెబనాన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా సంస్థ సభ్యులు వాడుతున్న పేజర్లు పేలాయి. లెబనాన్ దేశ వ్యాప్తంగా పలు చోట్ల పేలుళ్లు సంభవించగా ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందగా 2800 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

Chandra Grahan 2024: చంద్రగ్రహణం ఎలా, ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుందా ? పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రేపు రాత్రి ఆకాశంలో అందమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు.

Advertisement
Advertisement