Mumbai, November 11: దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి(Independent India's first education minister) మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవం(The 11th National Education Day )గా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 131వ జయంతి(Abul Kalam Azad Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా ( freedom fighter)భారతప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) పనిచేశారు.
ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు..'ఆజాద్' అనేది ఆయన కలంపేరుగా స్థిరపడింది. 1888 నవంబరు 11న మక్కాలో ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు అబుల్ కలాం జన్మించాడు. అబుల్ కలాం అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు.
మౌలానా ఆజాద్ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించారు. ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.
స్వయంగా సాహితీవేత్త అయిన మౌలానా 'ఇండియా విన్స్ ఫ్రీడమ్'ను రాశారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషిచేశారు. దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.
బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు ఏర్పాటు చేశారు.
ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో సాంకేతిక విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను ఆయన స్థాపించారు.
విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.