File Image of Nirmala Sitharaman | (Photo-ANI)

New Delhi, September 18: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. జీఎస్టీ (Goods and Service Tax (GST) పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని నిర్మల ( Nirmala Sitharaman) వివరించారు.

లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ అనంతరం కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొవిడ్‌ సంబంధిత ఔషధాలపై తగ్గింపు డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆరోగ్య శాఖ సిఫార‌సు చేసిన ఏడు ఇత‌ర ఔష‌ధాల‌పై ఐజీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి త‌గ్గింపునిచ్చింది.

రాష్ట్రాలు విధించే నేష‌న‌ల్ ప‌ర్మిట్ ఫీకి మిన‌హాయింపునిచ్చారు. ఎయిర్‌పోర్ట్‌, ఇత‌ర దిగుమ‌తుల‌పై డ‌బుల్ టాక్స్ నుంచి మిన‌హాయింపునిచ్చారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల‌తో నడిచే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌థ‌కాల‌పై జీఎస్టీ రాయితీనిచ్చారు. జ‌న‌వ‌రి నుంచి ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్ సెక్టార్ల‌పైఇన్వ‌ర్టెడ్ డ్యూటీ స‌ర్దుబాటుతో జీఎస్టీలో మార్పులు అమ‌లుకానుంది.

వ్యాక్సినేషన్‌లో చైనా రికార్డు బ్రేక్ చేసిన భారత్, దేశంలో తాజాగా 35,662 మందికి కోవిడ్, ప్రస్తుతం 3,40,639 కేసులు యాక్టివ్

ప్రస్తుతం సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంది. అలాగే, క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలీవరి సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వినియోగదారులపై కొత్తగా ఎలాంటి పన్నూ వేయడం లేదన్నారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్‌ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.

కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా భౌతిక సమావేశం కావడం విశేషం. అంతకు ముంద చివరి సమావేశం 20 నెలల క్రితం 18, డిసెంబర్ 2019 న జరిగింది. అప్పటి నుండి GST కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతూ వస్తుంది.

తగ్గేవి..పెరిగేవి

పెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ప్రొడక్టులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో వీటి ధరలు తగ్గే ఛాన్స్ లేదు. కరోనా మెడిసిన్స్‌పై జీఎస్‌టీ మినహాయింపు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దీంతో ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ వంటి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ఇకపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. అలాగే పార్లర్‌లో ఐస్‌క్రీమ్ తింటే 18 శాతం జీఎస్‌టీ పడుతుంది.

రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్‌పై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. బయో డీజిల్‌పై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. వికలాంగులు ఉపయోగించే వెహికల్స్‌పై జీఎస్‌టీని 5 శాతానికి కుదించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌ మీద జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఓడలు, విమానాల ద్వారా చేసే ఎగుమతులపై మరో ఏడాది వరకు జీఎస్‌టీ ఉండదు. క్యాన్సర్ ఔషధాలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం చెల్లింపు 2022 జూన్ తర్వాత పొడిగింపునకు కేంద్రం అంగీకరించలేదు.

ఒకే రోజు 2 కోట్ల వ్యాక్సినేషన్, సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత్, హెల్త్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ

కండ‌రాల క్షీణ‌త‌ను నివారించ‌డానికి దిగుమ‌తి చేసుకునే ఔష‌ధాల‌పై ప‌న్ను మిన‌హాయింపునిచ్చారు. ఆంఫోటెరిసిన్‌-బీ, టోలిసిలిజుమాబ్‌, రెమ్‌డెసివిర్‌, హెపారిన్ వంటి యాంటీ కాగులెంట్స్‌ల‌పై జీఎస్టీ మిన‌హాయింపు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు కొన‌సాగింపు. క్యాన్స‌ర్ చికిత్స‌కు ఉప‌యోగించే కెయ్‌ట్రుడా, త‌దిత‌ర ఔష‌ధాల‌పై త‌గ్గింపు. ఇవి కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

కరోనా వైరస్‌కు సంబంధించి మందులపై 12 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం వరకు తగ్గిస్తున్నామని ప్రకటించారు ఐటొలిజుమాబ్, పొసాకాన్‌జొల్, ఇన్‌ఫిక్స్‌మాబ్, బామాలాన్విమాబ్, ఈటెసెవిమాబ్, కాసిరివిమాబ్, ఇంబెవిమాబ్, 2 డాక్సీ డీ గ్లూకొజ్, ఫెవిఫిరవిర్ మందులపై రాయితీ ఉంటుందని తెలియజేసింది. ఇంతకుముందు సెప్టెంబర్ 30వ తేదీ వరకు తగ్గించాలని ప్రతిపాదించింది. దానిని మరో 3 నెలలు ఎక్స్ డెంట్ చేసింది. మిగతా మందుల విషయానికి వసతే ఆంఫొటెరిసన 5 శాతం రాయితీ ఉండే దానిని మొత్తానికి తీసివేశారు. టొసిల్ మాబ్ కూడా జీరో చేశారు. రెమిడెసివర్ 12 శాతం నుంచి 5 శాతం చేశారు. హెపరిన్ కూడా 12 నుంచి 5 శాతం చేశారు. అలాగే సిక్సింకు 1శాతం లేవి ఇవ్వడానికి కౌన్సిల్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. మూడేళ్లపాటు ఇవ్వబోమని చెప్పినట్టు సమాచారం.

32 జిల్లాలకు నిధులు విడుదల చేయండి: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. లఖ్‌ నవూలో జరిగిన జీఎస్టీ మండలి 45వ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈమేరకు కేంద్ర మంత్రికి లేఖ అందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐజీఎస్టీ పరిహారంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.210 కోట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పది నుంచి 33కి పెరిగిన నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తొమ్మిది పాత జిల్లాలకు కాకుండా హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను 2021-22 నుంచి మరో ఐదేళ్లు పొడిగించాలని కోరారు. 2019-20, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బీఆర్జీఎఫ్‌ నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. 2020-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంటుగా సిఫారసు చేసిన రూ.723 కోట్లు ఇవ్వాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతోంది: బుగ్గన

జీఎస్టీ ప్రవేశ పెట్టక పూర్వం వార్షిక వృద్ది 17శాతం వరకు ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో శుక్రవారం జరిగిన 45 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి బుగ్గన పలు సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రం నుండి బుగ్గనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ రజత్ భార్గవ, రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ సుడగాని, వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య నిర్మాణం కింద రాష్ట్ర పన్నుల అధికారాలపై దృష్టి సారించాలన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో జీఎస్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ తన పూర్వవైఖరికే కట్టుబడి ఉందని వీటిని జీఎస్టీలో కలపవలసిన అవసరం లేదన్నారు. వ్యాట్ అమలు కాలంలో రాష్ట్రం యొక్క పూర్వ ఆదాయాలతో ప్రస్తుతం వస్తున్న జీఎస్టీ ఆదాయాలు ఏమాత్రం సరిపోలడం లేదన్నారు.

2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు 3 సంవత్సరాల పాటు 14 నుండి 15శాతం సగటు వార్షిక వృద్ధిని నమోదు చేయగా, జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత గత 4 సంవత్సరాలలో దాని సగటు పెరుగుదల సుమారు 10శాతం మాత్రమే ఉందన్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం పరిహారం అందించడం తప్పనిసరన్నారు. మరోవైపు కరోనా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, వచ్చే ఏడాది రాష్ట్ర ఆదాయాలు పుంజుకుంటాయని అంచనా వేసినా పరిస్ధితులు అందుకు అనుగుణంగా లేవని అన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి పరిహారం రూపంలో అదనపు నిధులు తప్పనిసరని స్పష్టం చేసారు. ప్రతి సంవత్సరం 14శాతం వృద్ధికి భరోసా ఇస్తూ, 2025 వరకు పరిహారాన్ని పొడిగించాల్సిన అవసరాన్ని బుగ్గన నొక్కిచెప్పారు.

నాపరాయి ఫలకాలపై పన్ను రేటు అంశాన్ని ప్రధానం ప్రస్తావించిన మంత్రి పాలిష్ చేసిన ఫలకాలపై ఉన్న పన్ను రేటును 18శాతం నుండి 5శాతానికి పరిమితం చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సౌర విద్యుత్ ప్లాంట్లు, మద్యం తయారీ కార్యకలాపాలలో జాబ్ వర్క్ లపై పన్ను రేటును 5శాతానికి తగ్గించాలని అభ్యర్థించారు. మరోవైపు 28శాతం జీఎస్టీ, 12శాతం పరిహార సెస్సును ఆకర్షించే ఏరేటెడ్ పానీయాలతో సమానంగా మసాలా నీటిని శుద్ధి చేయాలా వద్దా అన్న అంశంపై అధ్యయనం చేయాలన్నారు. ఆదాయ పరంగా రాష్టం ఇబ్బందులలో ఉన్నందున, 2021 ఆగస్టు వరకు ఏపీకి చెల్లించాల్సిన పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని తద్వారా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతామని వివరించారు.