Medical workers (Photo Credits: IANS)

New Delhi, September 20: భార‌త్‌తో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల‌సంఖ్య 54,00,620 చేరింది. అయితే రిక‌వ‌రీ రేటు సైతం భారీగానే న‌మోద‌వుతుంది. గడిచిన 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య (Case Fatality Rate) 43,03,044కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య10,10,824గా ఉంది.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో 12 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం మీద ఇప్పటిదాకా 6.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 19.10శాతంగా ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 79.28గా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది.

కేసుల భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ రికవరీలో (Recovery Rate) ప్రపంచంలో మనమే నంబర్‌ వన్‌ గా నిలిచాము. భారత్‌లో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 43,03,044 మంది కోవిడ్‌–19 నుంచి కోలుకున్నారు. దీంతో భారత్‌ రికవరీలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. అమెరికా 41 లక్షల మంది రికవరీతో రెండో స్థానంలో ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ కేసులు 4.04 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల 13 వేల వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 53,08,014కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 79.28గా ఉంది.

చైనాలో మళ్లీ వేల మందికి కొత్త వైరస్, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యతలకు కారణమవుతున్న బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా, జంతువుల ద్వారా వ్యాప్తి

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడం, అత్యధికంగా పరీక్షలు చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్‌ విధానాన్ని సమర్థంగా నిర్వహించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ఈ స్థాయిలో రికవరీ సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, శరీరంలో వైరస్‌ దాడి తీవ్రతరం కాకుండా రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల వినియోగం, ఆక్సిజన్‌ పరికరాలు, వెంటిలేటర్ల వినియోగం పెంచడం, ప్లాస్మా థెరపీ, అవసరమైతే స్టెరాయిడ్స్‌ ఇస్తూ ఉండడంతో ఈ స్థాయిలో రికవరీ సాధించామని తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో జనాభాతో పోల్చి చూస్తే చాలా స్వల్పమేనని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా 60% వరకు రికవరీ కేసులు వస్తున్నాయని వివరించింది.