First RapidX Train (Photo-X)

New Delhi, Oct 20: భారత్‌లోనే తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ సర్వీస్‌ ‘ర్యాపిడ్‌ ఎక్స్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ–ఘజియాబాద్‌–మీరట్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కారిడార్‌కు ప్రధాని మోదీ జెండా ఊపి జాతికి అంకితం చేశారు.

ఢిల్లీ- గాజియాబాద్‌- మేరఠ్‌ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి.

నమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.

వీడియో ఇదిగో, పట్టాలపై పరుగులు పెట్టిన నమో భారత్‌ సెమీ హైస్పీడ్‌ రైలు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

ర్యాపిడ్‌ ఎక్స్‌ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది.ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు గంటకు 180 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి. ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు.ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు.రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది.

ల్యాప్‌టాప్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్‌ పుష్‌ బ్యాక్, కోట్‌ తగిలించుకునే హుక్, ఫుట్‌ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్‌ కొనుక్కునేందుకు వెండింగ్‌ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి.ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.

పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. చార్జీలు స్టాండర్డ్‌ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100గా ఉంటుంది.ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిల్చొని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు.

ప్రతి స్టేషన్‌నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది.ఈ ర్యాపిడ్‌ ఎక్స్‌ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది.ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు.

ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇందులో డ్యుయల్‌ వ్యూతో కూడిన ఎక్స్‌ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కన్పిస్తాయి.ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్‌ డిటెక్షన్‌–డిస్పోజల్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు.

ప్రీమియం కోచ్‌లలో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్ల అమరిక ఉంటుంది. కోటు, పుస్తకాలు వంటివి తగిలించుకునే ఏర్పాట్లు చేశారు. ఫుట్‌రెస్ట్‌లు ఉంటాయి. ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు అందుబాటులో ఉంటారు.ఎనిమిది ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్లకు గానూ ముందుగా మూడింటిని ప్రాధాన్య ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు.