న్యూఢిల్లీ, నవంబర్ 20 : ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు. గూగుల్ లిస్టెడ్ కస్టమర్ కేర్ నంబర్ ద్వారా సహాయం కోరినప్పుడు ఈ మోసానికి గురయ్యాడు. ఆశ్చర్యకరంగా, కనుగొనబడిన ఆ ఉబర్ నంబర్ నకిలీ అని తేలింది,
IANS కథనం,అలాగే నమోదైన FIR ప్రకారం, SJ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రదీప్ చౌదరి అనే బాధితుడు గురుగ్రామ్‌కు రూ. 205 తో క్యాబ్ బుక్ చేసుకున్నాడు.అయితే ఉబెర్ అతని నుండి రూ. 318 వసూలు చేసింది. అయితే దాని గురించి డ్రైవర్ ని అడగగా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మొత్తాన్ని తిరిగి వాపసు పొందండి అని తెలిపారు.
అయితే కస్టమర్ కేర్ నంబర్ తెలియకపోవడంతో గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో '6289339056' నంబర్ కనిపించడంతో దానికి కాల్ చేశాడు. అది '6294613240'కి మళ్లించబడింది, ఆపై '9832459993'లో రాకేష్ మిశ్రాకు మళ్లించబడింది. అతనితో మాట్లాడిన తరువాత Google Play Store నుండి 'రస్ట్ డెస్క్ యాప్'ని డౌన్‌లోడ్ చేయమని నన్ను ఆదేశించాడు. ఆ తర్వాత, అతను నాకు PayTM తెరిచి, రీఫండ్ అమౌంట్ కోసం 'rfnd 112' అని మెసేజ్ చేయమని అడిగాడు. నా ఫోన్ నంబర్ అందించడం గురించి ప్రశ్నించినప్పుడు ఇది ఖాతా ధృవీకరణ కోసం అని అతను చెప్పాడని కస్టమర్ తెలిపారు.
“ప్రారంభంలో, రూ. 83,760.. బాధితుడు అకౌంట్ నుంచి అతుల్ కుమార్ అనే వ్యక్తికి బదిలీ చేయబడింది, ఆ తర్వాత నాలుగు లక్షలు, రూ. 20,012, రూ. 49,101, వరుసగా ఇతర నాలుగు లావాదేవీలు జరిగాయి. ఫిర్యాదుదారు ప్రకారం మూడు లావాదేవీలు PayTM ద్వారా మరియు ఒకటి PNB బ్యాంక్ ద్వారా జరిగాయి. దీంతో మోసపోయిన బాధితడు పోలీసులను ఆశ్రయించాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66డి కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని, విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.