Kalaburagi Road Mishap: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం, గర్భిణి సహా ఏడుగురు మృతి, ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో ఘటన
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం (Kalaburagi Road Mishap) చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం (Road accident in K'taka disctrict) చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.
Bangalore, Sep 27: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం (Kalaburagi Road Mishap) చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం (Road accident in K'taka disctrict) చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.
మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. కాగా వీరందరూ అలండ్ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. అందులోబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వీరంతా కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు, 16 మంది మృతి
పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కలబురగి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 27, 2020 12:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

