Contact Sports. Representational Image. | (Photo Credits: IANS)

కౌమారదశలో ఎవరైతే ఫుట్ బాల్, రగ్బీ లాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ (ఒకరితో ఒకరు పోటీ పడేటువంటి) ఆడుతారో అలాంటి పిల్లలు యుక్తవయసుకు వచ్చినపుడు లేదా వయసు పెరిగే కొద్దీ వివిధ కారణాల చేత ఏర్పడే మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మానసిక బలహీనత, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలను నియంత్రణలో ఉంచుకుంటారని ఒక తాజా అధ్యయనంలో తేలింది. దాదాపు 11,000 మంది యువతపై 14 సంవత్సరాల పాటు చేసిన అధ్యయనం ప్రకారం క్రీడలు ఆడేవారు 20- 30 వయసులో మానసిక ఆరోగ్య సమస్య (Mental health Issues)లతో బాధపడే అవకాశం తక్కువ అని ఆర్థోపెడిక్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్స్ (Orthopaedic Journal of Sports Medicine) లో అధ్యయనానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

ఇలాంటి క్రీడలు ఆడటం వలన తలకు మరియు శరీరభాగాలకు గాయాలవుతాయని చాలా మంది పేరేంట్స్ తమ పిల్లలను ఈ ఆటలకు దూరంగా ఉంచుతారు.అయితే ఇలాంటి ఆటలకు దూరంగా ఉంచడం వలన మానసికంగా బలహీనంగా, సెన్సిటివ్ గా ఉండే పిల్లలపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని స్టడీస్ అభిప్రాయపడ్డాయి. 1994 నుంచి డేట్ ఆఫ్ బర్త్ కలిగిన 10,951 మంది డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. క్రీడల్లో చురుగ్గా పాల్గొనే వారిని, క్రీడలు ఆడటానికి ఇష్టపడని వారిని వేరువేరుగా విభజించి వారి డేటాను నమోదు చేశారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి పరిశోధకులు వివిధ రకాల ప్రశ్నలు, క్విజ్ లు, మెమొరీ రీకాల్స్ కి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏయే సమయాలలో వారు ఎలా స్పందించారు. స్కోర్స్ తక్కువ వచ్చినపుడు నిరాశకు లోనయ్యారా? ఎప్పుడైనా ఆత్మహత్య గురించి ఆలోచించారా? అని జాగ్రత్తగా అడిగి తెలుసుకున్నారు.

మిగతా వారి కంటే చిన్నప్పటి నుంచే క్రీడలు ఆడినవారు తక్కువ డిప్రెషన్ కలిగి ఉన్నారని పరిశోధకులు తెలిపారు. వారి నివేదిక ప్రకారం, 8 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్నపుడు ఎవరైతే క్రీడల్లో చురుగ్గా పాల్గొంటారో వారు 20 మరియు 30 ఏళ్ల వయసుకు వచ్చినపుడు నిరాశ నిస్పృహలకు గురయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వెల్లడించారు. అలాంటి వారు వయసు పెరిగే కొద్దీ శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని వారు ఎల్లప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తారని అధ్యయనం పే