రాష్ట్రీయం

Telangana Fire: కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు, 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతి, వీడియో ఇదిగో..

Vikas M

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి కంటైనర్‌లో తరలిస్తున్న 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ముంబై నుంచి హైదరాబాద్ లోని ఓ షోరూంకి తీసుకువెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఉరి వేసుకుని ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి

Vikas M

ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి కన్నీరు అందరిచేత కంటతడిపెట్టించింది. ఇంతమంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది

Container Catches Fire: ఖ‌రీదైన కార్లు త‌ర‌లిస్తున్న కంటైన‌ర్ లో చెల‌రేగిన మంట‌లు, పూర్తిగా కాలిపోయిన 8 కార్లు, జహీరాబాద్ హైవేపై ఘ‌ట‌న‌

VNS

కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్ లో మంటలు (Fire Accident in Zaheerabad) చెలరేగి.. 8 కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ లో చోటు చేసుకుంది. ముంబై నుంచి కార్లను తరలిస్తున్న కంటైనర్.. జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే..ఒక్కసారిగా మంటలు (Container Catches Fire) చెలరేగాయి.

Amaravati: ఇక శ‌ర‌వేగంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు, రూ. 15వేల కోట్ల రుణం వాడ‌కంపై ఉత్త‌ర్వులు ఇచ్చిన ప్ర‌భుత్వం, పనులు వేగవంతం చేయ‌నున్న సీఆర్టీఏ

VNS

అమరావతి (Amaravati) నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.

Advertisement

KTR:దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా..కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్, కేటీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సవాల్

Arun Charagonda

కేటీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హౌలా సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్...వరంగల్ అభివృద్ధిపై పదేళ్లు మీరేం చేశారు..? ఏడాదిలో మేం ఏం చేశాం..? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా...ఐదేళ్లు మహిళను మంత్రిగా చేయలేని మీరు మా మంత్రుల గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేయిస్తుంటే.. ఎదురు తిరగమని కేటీఆర్ అంటున్నారు...ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అన్నారు.

KTR: బీసీ డిక్లరేషన్ బోగస్...42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చాకే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి,కులగణనలోని ప్రశ్నలు తగ్గించాలని డిమాండ్

Arun Charagonda

బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేటీఆర్.. బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది.. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలి.. ప్రభుత్వం పైన నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నారు.

Tiger In Mancherial: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం, అధికారులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ సిబ్బంది..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో శనివారం తెల్లవారుజామున సంచరించింది పెద్దపులి. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు తెలుస్తోండగా ముత్యంపల్లి అటవీ సెక్షన్‌ పరిధిలోకి పెద్దపులి రావడంతో అధికారులను అప్రమత్తం చేసింది అటవీ శాఖ సిబ్బంది.

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్, విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?, తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.

Advertisement

Aghori At Srisailam: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి, బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైంది. బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని ముఖద్వారం వద్ద అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బట్టలు కట్టుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లింది అఘోరి.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు, తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెషర్, ధ్వంసమైన ప్రహరీ గోడ...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 లో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలింది. దీని ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Yadagirigutta Temple: కార్తీక మాసం..యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం...దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు

Arun Charagonda

కార్తీక మాసం నేపథ్యంలో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని వెల్లడించారు ఆలయ అధికారులు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.

YSRCP Sajjala Bhargav Reddy: వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, పోస్టులను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు

Arun Charagonda

వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేయగా భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Andhra Pradesh: కడపలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండ చిలువ, కాసేపు నిలిచిన రాకపోకలు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లో నడిరోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. కడప జిల్లా మైదుకూరు ప్రధాన జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి సమీపంలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురై కాసేపు రాకపోకలు నిలిపివేశారు వాహనదారులు.

TG Holidays: 2025లో 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు.. సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది.

AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Rudra

నైరుతి బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

Viral Video: బైక్‌ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

రోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్‌ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.

Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.

YS Jagan Hit out AP CM Chandrababu: ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్ చేస్తున్న‌దెవ‌రు? చంద్ర‌బాబుపై ట్విట్ట‌ర్ లో విరుచుకుప‌డ్డ వైఎస్ జ‌గ‌న్

VNS

సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు (AP CM Chandrababu) తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?` అని ఎక్స్ వేదికగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

KCR Comments on Congress Govt: నిర్మించేందుకు అధికారం ఇచ్చారు, కూల్చేందుకు కాదు! కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ దే గెలుప‌ని ధీమా

VNS

ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యతను అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ (BRS) నాయకులు భయపడవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement