రాష్ట్రీయం

Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి

Vikas M

అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.

CPI Narayana: వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ

Hazarath Reddy

సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ..

Andhra Pradesh: వీడియో ఇదిగో, గుడివాడలో ఇళ్ళ మధ్య లిక్కర్ షాపు పెట్టిన నిర్వాహకులు, వెంటనే తీసేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

Hazarath Reddy

నివాసాల మధ్య వైన్ షాప్ పెట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు. గుడివాడ బేతవోలు సెంటర్లోని గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఒక షాపులో ఈరోజు ఉదయం నూతనంగా మద్యం షాపును ఏర్పాటు చేశారు.వైన్ షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు .

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Advertisement

YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

Telangana: వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు

Hazarath Reddy

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో సీఎం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Andhra Pradesh Rains: ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం, పలు తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు, భారీ వర్షాలతో ఏపీ విలవిల

Hazarath Reddy

వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది.

Telangana: వీడియో ఇదిగో, ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహాం, ప్రేమించాలంటూ సంవత్సరం పాటు ఆమె వెంట పడి చివరకు సక్సెస్

Hazarath Reddy

జగిత్యాల జల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కి చెందిన కుమార్, మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ అయినా కరుణాంజలి కొంత కాలంగా ప్రేమిస్తున్నానని కుమార్ తెలిపాడు. కరుణాంజలి అంత త్వరగా ఒప్పుకోలేదు. కుమార్ తన ప్రేమని వ్యక్తం చేయడంతొ కరుణాంజలి ఒప్పుకున్నది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా, రోడ్డు పైకి మొసళ్లు రావడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

Hazarath Reddy

నిర్మల్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో, మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. మామడ మండలంలోని మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

New GHMC Commissioner: జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రిలీవ్ అయిన ప్రస్తుత క‌మిష‌న‌ర్‌ ఆమ్ర‌పాలి

Hazarath Reddy

జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో నూతన ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది

Kuppam TDP Leader Khadar Basha: మరో టీడీపీ నేత రాసలీలలు వీడియో ఇదిగో, పింఛన్ ఇప్పిస్తానంటూ గాజుల ఖాదర్‌ బాషా నన్ను లైంగికంగా అనుభవించాడంటూ వీడియో ద్వారా తెలిపిన యువతి

Hazarath Reddy

ఏపీలో మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది.

Andhra Pradesh: ప్రత్తిపాడులో చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు

Hazarath Reddy

Advertisement

Telangana: రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

Hazarath Reddy

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు.

Andhra Pradesh: ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే గ్రామాలు, నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు మోసుకువెళ్లిన బందువులు

Hazarath Reddy

IT Raids At Real Estate Firms: ప్ర‌ముఖ‌ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌పై ఇన్ క‌మ్ ట్యాక్స్ దాడులు, పేరుమోసిన బిల్డ‌ర్ల ఇళ్ల‌లో విస్తృత సోదాలు

VNS

హైదరాబాద్‌లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

High Tension in Ashok Nagar: హైద‌రాబాద్ అర్ధ‌రాత్రి హై టెన్ష‌న్, ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి వ‌చ్చిన నిరుద్యోగులు, అశోక్ న‌గ‌ర్ లో భారీగా పోలీసుల మోహ‌రింపు

VNS

అశోక్‌నగర్‌ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు (Group 1 Candidates) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అంటూ గర్జించారు.

Advertisement

Cyclone In AP: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ వ‌ర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాలు, తిరుమ‌ల శ్రీ‌వారి మెట్టుమార్గం మూసివేత‌

VNS

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది.

Medak Road Accident: మెదక్‌ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

మెదక్‌ జిల్లా శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Andhra Pradesh Rains: నెల్లూరుకు దగ్గరగా వచ్చిన వాయుగుండం, రేపు తీరం దాటే అవకాశం, రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.

Medak Road Accident: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు

Arun Charagonda

మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ దగ్గర రోడ్డుపై ఓ గుంత ఏర్పడింది.వేగంగా వెళ్లిన ఓ కారు ఆ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Advertisement
Advertisement