రాష్ట్రీయం
Andhra Pradesh Elections 2024: పెట్రోలుతో చంద్రబాబు ఇంటిని ముట్టడించిన తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు.
YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్
Rudraతన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.
AP Horror: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీభత్సం.. రోడ్డు పక్కన ఉన్న వారి మీదనుంచి దూసుకెళ్లిన బస్సు.. లారీ టైర్ మార్చుతుండగా ఘోరం.. ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం.. పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం
Rudraఆంధ్రప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పత్తిపాడు హైవేపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది.
Kavitha Letter To CBI: విచారణకు రాలేను! సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత, ఎన్నికల షెడ్యూల్ లో బిజీగా ఉన్నానంటూ సమాధానం
VNSసీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి (Letter To CBI) లేఖ రాశారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు
Janasena - TDP Crisis: చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరి సగం మంత్రి పదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే పొత్తులో ఉండాలి..పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
sajayaHarirama Jogayya Letter to Pawan Kalyan: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య రాసిన లేఖలో.. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? అని విమర్శించారు.
BJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్..
sajayaBJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో బీజేపీ తరఫున పోటీకి దిగే 6గురు ఎంపీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. వీరిలో కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వర్ రావు ఉన్నారు. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ లభించింది.
Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో
sajayaషణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Two More Guarantees: ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Rudraఆరు గ్యారంటీల అమలులో భాగంగా మరో రెండో హామీల అమలుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం (ఈ నెల 27) నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
PM Vizag Tour Cancelled: ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు?? ఏయూ మైదానంలో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు
Rudraప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్టు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు పీఎం షెడ్యుల్ ఖరారైంది.
Telangana Shocker: బిక్షం అడిగాడని యాచకుడిని కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో, వెనక వస్తున్న టిప్పర్ కింద పడి యాచకుడు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyభిక్షం అడిగినందుకు డిప్యూటీ ఎమ్మార్వో యాచకుడిపై దారుణంగా ప్రవర్తించాడు. బిక్షం అడిగాడని ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో అతను టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
TDP-Janasena's First List: ఇంకా టికెట్ దక్కని టీడీపీ కీలక నేతల లిస్టు ఇదిగో, రెండో జాబితా పైనే గంపెడాశలు, జాక్ పాట్ కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్
Hazarath Reddyటీడీపీ కీలక నేతలైన గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు
Buragadda Vedavyas: చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు, పెడనలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేనేంటో చూపిస్తానంటూ బూరగడ్డ వేదవ్యాస్ సవాల్
Hazarath Reddyచంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్‌ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
TDP-Janasena's First List: రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి, టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి బుద్ధ ప్రసాద్
Hazarath Reddyటీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు
Medaram Jathara Last Day 2024: తిరిగి వనంలోకి దేవతలు ముగిసిన మేడారం జాతర వేడుకలు..2 కోట్ల మంది భక్తులు తరలి వచ్చినట్లు అంచనా..
sajayaగత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగిసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరగా పేరొందిన నాలుగు రోజుల సమ్మక్క-సారలమ్మ జాతర శనివారంతో ముగిసిపోయింది.
TDP - Jana Sena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు..
sajayaఅమరావతి: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మిగిలిన స్థానాలు తర్వాత ప్రకటించనున్న పవన్.. 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.
Medaram Jathara Ends Today: మ‌హా జాత‌ర‌లో ఇవాళ చివ‌రి అంకం, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, నేటితో ముగియ‌నున్న మేడారం జాత‌ర‌, వ‌న ప్ర‌వేశం చేయ‌నున్న స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌
VNSసమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది.
AP, Telangana Weather: తెలుగు రాష్ట్రాల‌కు చ‌ల్ల‌ని క‌బురు, రాబోయే మూడు రోజుల పాటూ ప‌లు జిల్లాలో మోస్త‌రు వ‌ర్షాలు, ఏపీలోని ఈ జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌
VNSగత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Weather Alert) పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో (Summer) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Traffic Jam Near Medaram: మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 15 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు, నరకం చూస్తున్న భక్తులు
VNSస‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ గ‌ద్దెల‌పైకి చేర‌డంతో జాత‌ర‌కు నిండుద‌నం వ‌చ్చింది. దారుల‌న్నీ మేడారానికి అన్న‌ట్టుగా.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో మేడారం – తాడ్వాయి (Heavy Traffic Jam Near Medaram) మ‌ధ్య సుమారు 15 కిలోమీట‌ర్ల మేర‌, ప‌స్రా నుంచి గోవింద‌రావుపేట వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది.
Mallu Ravi Resigned: కాంగ్రెస్ కీలక నేత రాజీనామా, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పదవికి రాజీనామా చేసిన మల్లు రవి
VNSఢిల్లో(Delhi) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి(Mallu Ravi) రాజీనామా(Resigned) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు.
Etela Rajender: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుండి తప్పకుంటానని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.