రాష్ట్రీయం

Skill Development Case: స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై విచారణ జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది

APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

CM Revanth Reddy Review on Power Utilities: విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష, నన్ను ఎవరూ పిలవలేదని తెలిపిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం

Hazarath Reddy

విద్యుత్‌ రంగంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

KCR Hospitalised: కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు

Advertisement

KCR Health Bulletin: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వెల్లడి

Hazarath Reddy

ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

CM Visits Flood Affected Areas: ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం, ప్రతి ఇంటికి రూ. 2,500, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు మిఛాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్‌. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో సీఎం జగన్‌ మాట్లాడారు.

Praja Darbar in Praja Bhavan: ప్రజా దర్బార్‌ వీడియోలు ఇవిగో, సమస్యలు విన్నవించుకునేందుకు వేలాదిగా ప్రజా భవన్‌కు తరలివచ్చిన ప్రజలు, వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు.

CM Revanth Reddy Responds CM Jagan Tweet: ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని ఆకాంక్షిస్తున్నామంటూ ట్వీట్ కు రిప్లై

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.

Advertisement

CM Revanth Reddy Responds PM Modi Tweet: ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మీ సహాకారం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి.. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు

PM Modi Tweet on KCR Health: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్, ఫాంహౌస్‌ బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో గాయం, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.

KCR Health Update: కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల, తుంటి ఎముకకు గాయం, శస్త్రచికిత్స అవసరం అవుతుందని తెలిపిన వైద్యులు, ప్రస్తుతం నిలకడగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం

Hazarath Reddy

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.

Kodandaram Key Role in TS Govt: ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్?

Rudra

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ అనుభవాలను, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Revanth Reddy Praja Darbar LIVE: కాసేపట్లో ప్రగతిభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం, మంత్రులు (లైవ్ వీడియోతో)

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి... అప్పుడే తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

Free Bus for Women: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు మార్గదర్శకాలు జారీ.. ఆధార్‌ కార్డును చూపిస్తే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదట!

Rudra

మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది.

DJHS Wishes to TS CM Revanth Reddy: నూతన ప్రభుత్వానికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ శుభాకాంక్షలు.. జర్నలిస్టుల ఇంటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం

Rudra

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన నూతన ప్రభుత్వానికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి శుభాకాంక్షలు తెలిపారు. డీజేహెచ్ఎస్ విన్నపం మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

Rudra

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలికి జరిగిన గాయంతో ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం.

Advertisement

Telangana Government Formation 2023: తెలంగాణకు మూడో దళిత డిప్యూటీ సీఎం, తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో చోటు, సీఎం రేవంత్ రెడ్డి టీం బయోడేటా ఇదిగో..

Hazarath Reddy

2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు

Pawan Kalyan Speech in Visakha: 2024లో సీఎం ఎవరనే దానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుతో కలిసి త్వరలో డిసైడ్ చేస్తామని విశాఖ జనసేన బహిరంగ సభలో వెల్లడి

Hazarath Reddy

జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan kalyan in VisakhaPatnam Meeting) స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్‌.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో (Janasena Meeting in Visakha) పవన్ మాట్లాడారు.

Central Tribal University in Telangana: తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు లోక్‌సభ ఆమోదం, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీగా నామకరణం

Hazarath Reddy

తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చిన తర్వాత బిల్లు ఆమోదం పొందింది.

APPSC Group-2 Notification Out: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 897 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు శుభవార్తను చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.

Advertisement
Advertisement