రాష్ట్రీయం

Andhra Pradesh: అక్రమ సంబంధం అనుమానం, భార్యతో పాటు మరో వ్యక్తికి సగం గుండు కొట్టించిన భర్త, చెప్పుల దండతో ఊరంతా ఊరేగించిన ఆమె అత్తింటివారు

Hazarath Reddy

శ్రీసత్య సాయి జిల్లాలోని లేపాక్షి మండలంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త..తన భార్య, మరో పురుషుడి జుట్టును సగం కత్తిరించారు. ఈ దారుణానికి కోడలి అత్తమామలు కూడా సహకరించారు. వారిద్దిరికీ మెడకు చెప్పులు కట్టి గ్రామంలో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Andhra Pradesh Shocker: పెళ్లికి ముందే తొందరపడి.. మురికి కాలువలో నవజాత శిశువును వదిలేసిన తల్లి, చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ షాకింగ్ ఘటనలో, చిత్తూరులోని ఓ ఆసుపత్రి సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలేసి పారిపోయారు. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలోని ఇరుకైన ఓపెన్ డ్రెయిన్‌లో నవజాత శిశువును వదిలివేయడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.

DK Aruna as Gadwal MLA: గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ, గెజిట్‌లో ముద్రించాలని ఆదేశాలు

Hazarath Reddy

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ CEOని కలిసి హైకోర్టు తీర్పు ప్రతి అందించారు డీకే అరుణ.

Chandrababu on Capital: అమరావతి కాదు మన రాజధాని పోలవరం, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో, అది నిర్మించే బాధ్యత మనది అని అన్ని గ్రామాల్లో చెప్పాలని పిలుపు

Hazarath Reddy

చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) మ‌న రాజ‌ధాని పోల‌వ‌రం అని, అది నిర్మించే బాధ్య‌త మనందరిది. ఈ విష‌యాన్ని అన్ని గ్రామాల్లో చెప్పాలంటూ చెప్పారు.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Advertisement

Telangana Rain Videos: వీడియోలు ఇవిగో, తెలంగాణలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు తలపిస్తున్న రోడ్లు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

Telangana: తీవ్ర విషాదం, కూతురు పెళ్లిలో తండ్రికి గుండెపోటు, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తిరిగిరాని లోకాలకు, కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో కూతురు పెళ్లి.. వివాహానికి అంతా సిద్ధమవుతుండగా.. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.

Telangana Rain: భారీ వర్షాల ధాటికి స్కూళ్లకు సెలవులు, కీలక నిర్ణయం తీసుకున్న నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి, తెలంగాణలో కుండపోత వర్షాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి.

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీలో ముసలం, మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు, వేయించింది ఎవరంటే..

Hazarath Reddy

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌కు వ్యతిరేకంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. సేవ్‌ ఎల్బీనగర్ కాంగ్రెస్‌ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి మధుయాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Andhra Pradesh: మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న చిన్నారి వద్దకు సీఎం జగన్, వైద్య సేవల కోసం ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల నారాయణ నిఖిల్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైద్య సేవల కోసం ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశం.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకున్న వర్షాలు, మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక ఇదిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

Heart Attack Kills MBBS Student: వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి

Hazarath Reddy

జార్జియాలోని టిబిలిసిలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రావూరి గిరీష్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

Viral Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రెప్పపాటులో రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు, వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరమంటూ ట్వీట్

Hazarath Reddy

వెంట్రకవాసిలో బతికి బయటపడ్డాడు! వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఇలా తొందరగా వెళ్లాలనే ఆత్రం ఏమాత్రం పనికి రాదు. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం వరించదు.టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ఇదిగో..

Advertisement

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ కోడలని షర్మిలకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి ఆమె ఎవరంటూ రేణుకా చౌదరి ఫైర్

Hazarath Reddy

షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను. పాలేరు నుండి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు..

Rains in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Rudra

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక

Rudra

మొన్నటివరకూ టమాటో ధరలతో కుదేలైన సామాన్యులకు ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.

Trains cancelled: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు.. నిజమాబాద్నుంచి వెళ్లే మరో మూడు సర్వీసులు కూడా క్యాన్సల్

Rudra

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Hyderabad Shocker: బ్రో.. కాస్త జాగ్రత్తగా ఉండండి!! హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ.. దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఉడాయింపు.. ఉద్యోగులు లబోదిబో.. అసలేం జరిగిందంటే??

Rudra

నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట వల వేయడం.. ట్రైనింగ్ పేరిట లక్షల్లో సొమ్ము గుంజేయడం.. అనంతరం డబ్బుతో ఉడాయించడం.. నేరస్తుల పంథా మారట్లేదు.

Hyderabad Shocker: ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం, తన ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై కత్తితో దాడి, అడ్డం వచ్చిన యువతి తమ్ముడిని విచక్షణారహితంగా పొడిచి చంపిన ఉన్మాది, యువతి పరిస్థితి విషమం

VNS

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో (LB nagar) ప్రేమోన్మాది ఘాతుకానికి (Lover Attack) పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ (Chintu) చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి (Sanghavi) పరిస్థితి విషమంగా ఉంది.

Vangaveeti Radha Engagement: ఆడంబరంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్, అక్టోబర్ 22న మ్యారేజ్ డేట్ ఫిక్స్, ఇంతకీ వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

VNS

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) (Vangaveeti Radha) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో (Pushavalli) రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.

Hyderabad police: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ హైదరాబాద్ పోలీసులపై జులుం చూపించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష

ahana

నారాయణగూడలో పోలీసు సిబ్బందితో గొడవపడిన యువకుడికి 20 రోజుల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం. ప్రణవ్ (29) అమెరికాలో ఉంటుండగా ఇటీవలే నగరానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement