ఆంధ్ర ప్రదేశ్
Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలను చలి పులి వణికిస్తోంది. ఏపీలో అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Huge Rush at Srishalam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)
Rudraవరుస సెలవులు రావడంతో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది.
ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?
Rudraడయాబెటిస్ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది.
Biryani at Rs. 4: రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)
Rudraఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.
America: అమెరికాలో రోడ్డు ప్రమాదం..కారును ఢీకొట్టిన ట్రక్కు...ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Arun Charagondaఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి యువతి మృతి చెందారు. వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ(26) MS చేయడానికి 2022లో US వెళ్లింది.. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఈ ప్రమాదంలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Andhra Pradesh: కూడా ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అపశృతి..ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్...కిందపడ్డ ప్రజాప్రతినిధులు, వీడియో ఇదిగో
Arun Charagondaకాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సీ.ఎల్ రోడ్డు కూడా కార్యాలయం లో కూడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే తుమ్మల రామస్వామి (బాబు) కార్యక్రమంలో అపశృతి నెలకొంది. ఒక్క సారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న టిడిపి సీనియర్ నాయకులు యనమల , శాసనసభ్యులు చిన్న రాజప్ప, పంతం నానాజీ, తుమ్మల రామ స్వామి..కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: ఏపీలో గంజాయి సాగు...15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టిన రైతులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో స్వచ్ఛందంగా గంజాయి పంటలు ధ్వంసం చేశారు రైతులు. దాదాపు 15 ఎకరాల్లో పండించిన గంజాయిని తగలబెట్టారు రైతులు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం కల్పించారు.
Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం.. రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaశ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించింది చిరుత. రోడ్డు పక్కన గోడపై చిరుత కూర్చొని ఉండగా చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు యాత్రికులు. చిరుత కూర్చొని ఉండగా దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్ లోని సూరత్ లో ఘటన (వీడియో)
Rudraగుజరాత్ లోని సూరత్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.
Car Overturns in Mancherial: మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
Rudraమంచిర్యాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతుండగా.. ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కారును పైకి లేపి అందులో ఉన్న వ్యక్తిని కాపాడారు.
Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..
Rudraహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Bigg Boss Season 8: నేడు బిగ్ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.
Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి
Rudraదేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు
Rudraఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు.
Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్
Rudraనిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.
Special Darshan Cancelled in Tirumala: వైకుంఠద్వార దర్శనానికి తిరుమల వెళ్తున్నారా? టీటీడీ కొత్త నిబంధనలు ఇవే! పలు దర్శనాలు రద్దు
VNSజనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikuntha Dwara Darshan) టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది
Chandrababu Phone Call To Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు, గతంలో పవన్‌కు చెప్పు చూపించిన శ్రీనివాస్..ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్న దువ్వాడ
Arun Charagondaవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు షాక్ తగిలింది. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ....పలువురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈపూరు- కూచినపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టగా అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి రెండు కార్లు. ప్రమాదంలో రెండు కార్లలోని వారికి గాయాలు కాగా ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.