ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: పలాసలోని షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం, రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌ కాలిపోవడంతో మంటలు వ్యాప్తి..రూ. 3 కోట్ల ఆస్తి నష్టం!

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా పలాసలోని జాస్మిన్ బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షాపు నుంచి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు స్థానికులు. రిమోట్ కంట్రోల్ సిస్టం కాలిపోడంతో షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది ఫైర్ సిబ్బంది. సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.

Andhra Pradesh: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ రైడ్స్, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు..

Arun Charagonda

వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్‌ గతంలో ప్రభుత్వ పీఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.

Andhra Pradesh: నిద్రలేకుండా చేస్తున్న నాగుపాము...కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తున్న పాము..ఎట్టకేలకు పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్‌..వీడియో

Arun Charagonda

ఏపీలోని మహానంది మండలం తమ్మడపల్లెలో గ్రామస్తులకు నిద్రలేకుండా చేసింది నాగుపాము. కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తుండగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి చాకచక్యంగా పామును బంధించారు స్నేక్ స్నాచర్ మోహన్. నాగుపాము పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

VNS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. గంజాయి(Ganja), డ్రగ్స్ పై (Drugs) ఇక యుద్ధమే అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు లోకేశ్.

Advertisement

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరుకు చెందిన హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య, రెండు కార్లలో వచ్చి..

Hazarath Reddy

హిజ్రాల నాయకురాలు హాసిని మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దుండగులు దారికాచి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హిజ్రా నాయకురాలు హాసినిని చంపేందుకు దుండగులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం.

Raghu Rama Krishna Raju Harassment Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

Hazarath Reddy

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు కలకలం, థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా భారత్‌‌కు తీసుకువస్తున్న ఇద్దరు అరెస్ట్

Hazarath Reddy

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో ప్రమాదకర బల్లులు స్మగ్లింగ్ కలకలం రేపింది. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్‌ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది.

Advertisement

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Arun Charagonda

గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. గత ఐదేళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ , మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Andhra Pradesh: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్, వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు..మూడు టీడీపీ ఖాతాలోకే!

Arun Charagonda

ఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్‌.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. డిసెంబర్‌ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్‌ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్‌ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌, అదేరోజు లెక్కింపు ఉండనుంది.

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Arun Charagonda

ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని పవన్ ప్రకటించారు.

Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో కేసు , మైనర్ బాలిక అత్యాచార విషయంలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదు మేరకు పోక్సో కేసు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో కేసు నమోదైంది. తిరుపతి జిల్లా యల్లమంద మైనర్ బాలికపై అత్యాచార విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపై పోక్సో కేసు నమోదు చేశారు యర్రావారిపాళెం పోలీసులు.

Advertisement

Special Trains To Sabarimala: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అందుబాటులోకి

Rudra

తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు

Hazarath Reddy

వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hazarath Reddy

సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Advertisement

Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

వీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.

Parliament Winter Session 2024: పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి నవంబర్ 25న పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాడు. పసుపు కుర్తా, తెల్ల లుంగీ ధరించి నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ఎంపీ వచ్చారు.

Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

Hazarath Reddy

రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ

Hazarath Reddy

ఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు

Advertisement
Advertisement