ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Shocker: ఆస్తి కోసం తల్లి తల నరికిన కొడుకు, ఏలూరు జిల్లాలో దారుణ సంఘటన, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దారునం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాలు విషయంలో గోలి సరోజినీ (60) ని తల నరికాడు కొడుకు జగ్గవరపు వెంకటరెడ్డి (45). అడ్డుగా వచ్చిన తన కొడుకును సైతం చితకబాదాడు వెంకటరెడ్డి. స్థానికుల సాయంతో బాధితురాలని చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
YSRCP on Vijayamma Open Letter: విజయమ్మ బహిరంగ లేఖపై స్పందించిన వైఎస్సార్సీపీ, అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఏంటని సూటి ప్రశ్న
Hazarath Reddyఅన్నా చెల్లెలు మధ్య కుటుంబ ఆస్తుల విషయం నేపథ్యంలో దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై వైసీపీ స్పందించింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది.
Andhra Pradesh: డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీ లెక్చరర్ దాష్టికం, విద్యార్థులను క్లాస్‌లోనే చితకబాదిన లెక్చరర్....వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని డోన్ పట్టణం శ్రీ సుధా కాలేజీలో దారుణం జరిగింది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయారని విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదాడు లెక్చరర్ దేవేంద్ర. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Anna canteen: వైఎస్‌ఆర్ జిల్లా అన్నా క్యాంటీన్‌లో పేలుడు, వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం...వీడియో ఇదిగో
Arun Charagondaకడపలో అన్నా క్యాంటీన్‌లో పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. అయితే వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
CPI Narayana: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం...రాజకీయం కాదు, బయట వాళ్ల జోక్యం అనవసరం...విజయమ్మ క్లారిటీ ఇచ్చాక కూడా రాద్దాంతం సరికాదన్న సీపీఐ నారాయణ
Arun Charagondaవైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తి వివాదంపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు...ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు అన్నారు. అందరూ నోరు మూసుకుంటే మంచిదని సూచించారు.
YS Vijayamma Letter on Property Dispute: వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి
YS Jagan Slams CM Chandrababu: రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు, సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం రద్దు నిర్ణయంపై మండిపడిన జగన్
Hazarath Reddyపంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
Babu Mohan: కేఏ పాల్‌కి షాకిచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా పోస్ట్ చేసిన నటుడు
Hazarath Reddyమాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి విదితమే
APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు
Hazarath Reddyఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు డ్యాన్స్ చేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు.
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు
Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం
Hazarath Reddyభారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి (వీడియో)
Rudraహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.
Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చనిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృతదేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)
Rudraబయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.
Andhra Pradesh:స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు
Hazarath Reddyఅదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేశ్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై వారు చర్చించారు. పోర్టులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.
YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.
YS Family's Property Dispute: ఆడబిడ్డ కన్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి
Hazarath Reddyమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో కూరగాయలు అమ్మినట్లు సంతలో మద్యం అమ్మకాలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyస్థానిక సంత మార్కెట్‌లో కొంతమంది బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా బహిరంగ మద్యం అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
Rudraఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.