ఆంధ్ర ప్రదేశ్
Union Cabinet Meeting Highlights: అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాతో కనెక్టివిటీ, రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ మీటింగ్ పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) మొత్తం రూ.6,798 కోట్ల అంచనా వ్యయంతో (సుమారుగా) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
Prakasam Barrage: మరోసారి వార్తల్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ, రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా మారిన రక్షణ గోడ...వీడియో ఇదిగో
Arun Charagondaకృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజి మరోసారి వార్తల్లో నిలిచింది. బ్యారెజ్ రక్షణ గోడ కుంగగా రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
YS Jagan Slams AP Govt: డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు
Hazarath Reddyచంద్రబాబు కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు వైఎస్ జగన్. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: కనీసం చెల్లెలుగా కూడా చూడటం లేదు, నాపై ట్రోలింగ్ వెనుక జగనన్న, వదిన ఉన్నారన్న షర్మిల, రాక్షస ముఠాతో ట్రోల్స్ చేస్తున్నారని మండిపాటు
Arun Charagondaనాపై ట్రోలింగ్ వెనుక మా అన్నయ్య, వదిన , సజ్జల ఉన్నారు అన్నారు వైఎస్ షర్మిల. వీళ్లంతా ఓ రాక్షస ముఠాను తయారు చేసి సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ చేపిస్తున్నారు అన్నారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్యను కూడా అవమానించే స్థాయికి దిగజారారు అన్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను.. కానీ ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని పక్కన పెట్టారు అని మండిపడ్డారు.
Cyclone Dana Update: దానా తుపాన్ తీవ్రత తెలిపే వీడియోలు ఇవిగో, అల్లకల్లోలంగా సముద్రం, వణుకుతున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు
Hazarath Reddyతూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana) వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Andhra Pradesh: ఒంగోలు బస్టాండ్‌లో దారుణం, ఓ మహిళను కర్రతో చితకబాదిన వ్యక్తి, అందరు చూస్తుండగానే ఘటన...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఒంగోలు లో దారుణం చోటు చేసుకుంది. ఒంగోలు బస్టాండ్‌లో మహిళను కర్రతో చావబాదాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే మహిళను చితక బాది, దుర్బాషాలాడుతు జుట్టుపట్టి లాగిపడేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh: ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో
Arun Charagondaవిజయనగరంలో జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కన పార్కింగ్ చేయగా కాలి బూడిదయ్యాయి బస్సులు. విజయనగరం రాజీవ్ స్టేడియం వద్ద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు పడటంతో మూడు బస్సులు దగ్దమయ్యాయి.
Cyclone Dana Live Updates: తీవ్ర తుఫాన్‌గా బలపడిన దానా, తీరం దాటే సమయంలో 120 కిమీ వేగంతో ఈదురు గాలులు, 200 రైళ్లు రద్దు, 10 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్ తీరాలకు అలర్ట్ జారీ చేశారు. 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.
Vangalapudi Anitha on Jagan: వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు, జగన్ పై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు. టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు చెబుతున్నారు. గతంలో సీఎం అని చెప్పుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు రాజకీయ సమావేశాలను సాకుగా చూపుతున్నారు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసి నీతి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
AP Cabinet Meeting Highlights: ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోవడం కుదరదు, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయం, ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.
APPSC New Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyచంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు
Guntur Nurse Murder Case: జగన్‌కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..
Hazarath Reddyరౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వెళ్లారు. వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
Andhra Pradesh: వచ్చేది మన ప్రభుత్వమే, నిందితులను వెంటాడి జైల్లో పెడతాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్‌ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్
Hazarath Reddyరాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.
Pulivendula Road Accident: వీడియో ఇదిగో, పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 25 మంది ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Seethakka Worships Lord Balaji: తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క, ప్రియాంక గాంధీ విజయం కోసం ప్రత్యేక పూజలు..తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
Arun Charagondaతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేస్తున్న శుభసందర్భంలో ఆమె ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
Andhra Pradesh: నడిరోడ్డుపై మొసలి కలకలం, పిల్లుట్ల జంక్షన్ సమీపంలోరోడ్డుపైకి వచ్చిన మొసలి, భయాందోళనలో ప్రజలు
Arun Charagondaనడిరోడ్డుపై మొసలి కలకలం కలకలం రేపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై అటుఇటు తిరిగింది మొసలి. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి ప్రజలు భయాందోళనకు గురికాగా స్థానికుల సమాచారంతో మొసలి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.
Vasireddy Padma Resigns YSRCP: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా, జగన్‌పై తీవ్ర విమర్శలు, రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని మండిపాటు
Arun Charagondaవైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రిలీజ్ చేసిన వాసిరెడ్డి పద్మ...జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ అంటే వ్యాపార కంపెనీ కాదని మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో, సమాజం పట్ల అంతకన్న బాధ్యత లేదని మండిపడ్డారు.
Pinipe Viswaroop Son Srikanth Arrest: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్ , 14 రోజులు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
Arun Charagondaమాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో అరెస్ట్ అయిన ముద్దాయి వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని శ్రీకాంత్ తరపు న్యాయవాది వెల్లడించారు.
YS Jagan: ఇవాళ గుంటూరు, కడప జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ, రాత్రి పులివెందులలో బస చేయనున్న జగన్
Arun Charagondaనేడు గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులో యువకుడి దాడిలో మృతిచెందిన..యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే మధ్యాహ్నం బద్వేల్‌కు బయల్దేరనున్న జగన్ ప్రేమోన్మాది దాడిలో మృతిచెందిన..దస్తగిరిమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల చేరుకుని అక్కడే బస చేయనున్నారు.