ఆంధ్ర ప్రదేశ్

Air India Plane Bomb Scare: విమానాలకు ఆగని బాంబు బెదిరింపు కాల్స్, విశాఖకు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్, తీరా చూస్తే..

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ నుంచి 107 మంది ప్రయాణికులతో విశాఖపట్నం (Delhi To izag flight) వెళ్తున్న ఎయిర్‌ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మంగళవారం అర్ధరాత్రి ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది.

Explosion In Srisailam Power House: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి..వీడియో

Arun Charagonda

శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్‌ యూనిట్‌లో నిలిచిపోయింది విద్యుత్‌ ఉత్పత్తి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

TDP Office Destroyed Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, నందిగాం సురేశ్‌, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Andhra Pradesh: వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి షాక్, భీమిలి బీచ్‌లో అక్రమ కట్టడాలను తొలగించిన జీవీఎంసీ అధికారులు

Arun Charagonda

ఏపీలోనూ అక్రమ కట్టడాల కూల్చివేత మొదలైంది. విశాఖ పట్నంలోని భీమిలీ బీచ్‌లో అక్రమ నిర్మించిన కట్టడాలను తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు.

Advertisement

AP And Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళం, హెరిటేజ్ ఫుడ్స్ తరపున సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటన

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు.

Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన

Vikas M

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Kadapa Fire Video: వీడియో ఇదిగో, కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం, సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ఒక్కసారిగా పేలుడు

Hazarath Reddy

ఏపీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. పేలిన వెంటనే మంటలు అక్కడున్న బైకులకు అంటుకున్నాయి.

Vijayawada Floods: విజయవాడలో బాహుబలి ఘటన, పీకల్లోతు నీళ్ళలో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తున్న వరద బాధితులు

Hazarath Reddy

విజయవాడ లో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని వరద బాధితులు తీసుకెళ్తోంది. పీకల్లోతు నీళ్ళు ఉండటం తో బిడ్డను కాపాడుకునేందుకు సింగ్ నగర్ వాసులు ఇలా మోసుకెళ్ళారు.

Advertisement

CM Chandrababu: వీడియో ఇదిగో, నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు, మీరున్నారు కదా ఏపీ ప్రజలకు భయం లేదని మోదీ చెప్పారని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

చంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరున్నారు కదా.. భయం లేదని చెప్పారు. హుద్‌హుద్‌ సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు’’ అని చంద్రబాబు అన్నారు.

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Andhra Pradesh Floods: వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో తెలిపిన వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం

Hazarath Reddy

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది.

Advertisement

Vijayawada Floods: వీడియో ఇదిగో, బుడమేరు వరద దెబ్బకి నీళ్లలో మునిగిపోయిన వందలాది కొత్త కార్లు, విజయవాడ శివారులోని కార్ల గోడౌన్లను ముంచెత్తిన వరదలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గన్నవరం బుడమేరు వరద దెబ్బకి కొత్త కార్లు నీళ్లపాలయ్యాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కార్ల గోడౌన్ల ను వరద నీరు ముంచెత్తడంతో కార్లు నీటిలో తేలుతున్నాయి.కొత్త కార్లు అన్నీ వరద నీటిలో 3 రోజులుగా నానుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.

Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ

Hazarath Reddy

భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.

Telugu States Floods: భారీ వరదలు,  తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్

Hazarath Reddy

యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రెండు తెలు రాష్ట్రాల ప్రజల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాని తెలిపారు.

Vijayawada Floods: ఎమోషనల్ వీడియో ఇదిగో, వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత కలుసుకున్న వెంటనే ఏడ్చేసిన తండ్రీకొడుకులు

Hazarath Reddy

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు కొట్టుకొస్తున్నది.భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల్లో చాలామంది చిక్కుకుని పోయారు.

Advertisement

IMD Weather Alert: ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ సెప్టెంబర్ 5 నుంచి మరో మరో ముప్పును చూసే అవకాశం ఉందని IMD తెలిపింది.సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD నుండి సోమవారం (సెప్టెంబర్ 2, 2024) అధికారిక ప్రకటన వెలువడింది.

Andhra Pradesh Rains: ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ వరదలు, ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్, వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటన

Hazarath Reddy

వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. విజయవాడలోని సింగ్‌ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా నడుము లోతు ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చారు.

Andhra Pradesh Politics: పుంగనూరులో టీడీపీకి షాక్, మళ్లీ వైసీపి గూటికి చేరిన మున్సిపల్‌ చైర్మన్‌ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు

Hazarath Reddy

ఇటీవల టీడీపీ చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.

Vijayawada Floods: శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ

Hazarath Reddy

భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Advertisement
Advertisement