Coronavirus Outbreak | Representational Image| (Photo Credits: IANS)

Amaravati, August 7: ఏపీలో గడచిన 24 గంటల్లో 80,376 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,908 మందికి పాజిటివ్ (1,908 new Covid cases) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 438 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 231, గుంటూరు జిల్లాలో 216, నెల్లూరు జిల్లాలో 213 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,103 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,80,258 పాజిటివ్ కేసులు (Cornavirus in Andhra) నమోదు కాగా... 19,46,370 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 20,375గా నమోదైంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,513కి పెరిగింది.

కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం (నో మాస్క్‌.. నో ఎంట్రీ), భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం.. ఈ మూడు కరోనా వైరస్‌ నియంత్రణకు కీలకమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అనుమతి, ప్రస్తుతం దేశంలో అందుబాటులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి, మోడెర్నా టీకాలు

27 రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రచార కార్యక్రమాలు గురువారం (ఈనెల 5న) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, షార్ట్‌ ఫిల్మ్‌లతో చేపట్టిన ఈ ప్రచారంలో ఏరోజు ఎక్కడ ఏకార్యక్రమాలు నిర్వహించాలన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు.

కోవిడ్‌ను నియంత్రించేందుకు నిఘా, పరీక్షలను బలోపేతం చేసిన ప్రభుత్వం కాంటాక్ట్‌ ట్రేసింగ్, చికిత్స, కోవిడ్‌ టీకా కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్‌–19 నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ ప్రచారం చేపట్టింది. ఈనెల 31న ముగిసే ఈ ప్రచార కార్యక్రమాలను కలెక్టర్లు, ఎస్‌పీలు పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీచేసింది.

గ్రామస్థాయి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రవాణా వాహనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, సినిమాహాళ్లు, క్రీడాసముదాయాలు, విహారస్థలాలు, వివాహాలు వంటి కార్యక్రమాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తారు. అందరూ మాస్క్‌ ధరించేలా, భౌతికదూరం పాటించేలా, తరచూ చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో బీచ్‌ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ప్రకటించారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఈ నిషేధాజ్ఞలు విధిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో దశ కోవిడ్‌ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇక తిరుపతి రుయా ఘటనపై హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం వల్లే ఘటన జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని, ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా మే నెలలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో 11 మంది బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే.