Coronavirus test (Photo-ANI)

Amaravati, july 17: ఏపీలో గడచిన 24 గంటల్లో 91,594 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి పాజిటివ్ (Corona in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 504 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 372, ప్రకాశం జిల్లాలో 315, పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,467 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,37,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,98,966 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,041 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,115కి పెరిగింది. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోతున్న కరోనా వ్యాక్సిన్ల (Covid Vaccine) స్టాక్‌ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. జూలైలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని.. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని సీఎం (AP CM YS Jagan) తెలిపారు.

2021: ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు,135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు, పోస్టుల వివరాలను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

జూన్‌లో కూడా ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని సీఎం ప్రధాని దృష్టికి తెచ్చారు. కోవిడ్‌ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని మోదీకి తెలిపారు. కోవిడ్‌ నివారణ చర్యలపై వివిధ రాప్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.

కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజనవల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజనవల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు కూడా ఏపీలో లేవు. అయినా సరే.. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాం. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటుచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేశాం. లక్షణాలున్న వారిని గుర్తించి టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగాం. కోవిడ్‌కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనే అని సీఎం అన్నారు.

ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. వీటిని ఎక్కడా కొంచెం కూడా వృధా చేయకుండా పకడ్బందీగా ఉపయోగించడంవల్ల మరింత ఎక్కువ మందికి వేయగలిగాం. అంటే.. 1,68,46,210 మందికి బదులు 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు వేయగలిగాం. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాలు అవలంబించడంవల్లే ఇంత ఎక్కువ మందికి ఇది సాధ్యమైంది. ఇక జూలైలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. అదే నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు.

కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో వారు ఇవ్వలేకపోతున్నారు. అలాగే, జూన్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. ఇలా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన కోవిడ్‌ టీకా స్టాకును తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.