Andhra Pradesh Assembly Election 2024: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదల..ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి..జనసేన 18 స్థానాల్లో MLA అభ్యర్థుల జాబితా విడుదల..పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..
ఏపీలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కూటమిలో భాగంగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దిగబోతోంది. బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత లిస్టులో ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .
ఏపీలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కూటమిలో భాగంగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దిగబోతోంది. బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత లిస్టులో ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది . బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావించిన నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి లభించింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఇదే..
రాజమహేంద్రవరం - దగ్గుబాటి పురందేశ్వరి
నరసాపురం - భూపతిరాజు శ్రీనివాస వర్మ
తిరుపతి - వరప్రసాదరావు
రాజంపేట - నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి
అరకు - కొత్తపల్లి గీత
అనకాపల్లి - సీఎం రమేశ్
ఏపీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. 18 నియోజకవర్గాలకు MLA అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
18 జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే..
పిఠాపురం- పవన్ కల్యాణ్
నెల్లిమర్ల-లోకం మాధవి
అనకాపల్లి–కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్– పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేశ్
పెందుర్తి – పంచకర్ల రమేశ్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పీగన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయక్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – ఆరణి శ్రీనివాస్
రైల్వే కోడూరు – డాక్టర్‌యనమల భాస్కరరావు
(The above story first appeared on LatestLY on Mar 24, 2024 10:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

