Hyderabad December09: సింగరేణి (Singareni )లో సమ్మె(strike) సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ(commercial mining)కు వ్యతిరేకంగా కార్మికులు విధులను బహిష్కరించారు. టీబీజీకేఎస్(TBGKS) తోపాటు ఏఐటీయూసీ(AITUC), ఐఎన్టీయూసీ(INTUC), హెచ్‌ఎంసీ(HMC), బీఎంఎస్(BMS), సీఐటీయూ(CITU) వంటి జాతీయ సంఘాలు(central trade unions) సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిప్ట్ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో కోల్‌బెల్ట్(Coal Blet) వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె(strike) మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సమ్మెలో సుమారు 40 వేల మందికిపైగా సింగరేణి కార్మికులు(Singareni Employees), మరో 25 వేల మంది వరకు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
సింగరేణి పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకుల(four coal blocks)ను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మంత్రిత్వ శాఖ(Coal Ministry)కు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం.. కావాలనే కేకే-6, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి, కేవోసీ బ్లాక్-3లను వేలం వేయాలని నిర్ణయించింది. చాలాకాలంగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది.
కేకే-6లో 70 మిలియన్ టన్నులు, సత్తుపల్లి బ్లాక్-3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, కేవోసీ బ్లాక్-3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీఎంపీడీఐ (కోల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్) కూడా ఈ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సిఫారసు చేసింది.
ఇప్పటికే ఇక్కడ ఉన్న తమకే కేటాయించాలని, కొత్తగా వేరే కంపెనీలకు కేటాయిస్తే పని చేయలేవని కూడా తమ సిఫారసులో పేర్కొన్నది. అయినా వినకుండా.. కేంద్రం, బొగ్గు మంత్రిత్వ శాఖలు కక్షపూరితంగానే సింగరేణికి కేటాయించకుండా వేలం వేయాలని నిర్ణయించాయి.