తెలంగాణ

AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో

Arun Charagonda

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Toddy From Neem Tree: వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కారుతుంది కల్లు. కల్లు కారుతున్న వేప చెట్టుకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

Hyderabad: ఎంత తెలివిగా బైక్ దొంగతనం చేశాడో చూడండి..ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీ టీవీ ఫుటేజ్

Arun Charagonda

హైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

CM Revanth Reddy: టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి

Arun Charagonda

స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Car Accident in Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం

Rudra

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.

Rain in Hyderabad: హైదరాబాద్‌ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ

Rudra

రాజధాని హైదరాబాద్‌ లో వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మలక్‌ పేట, దిల్‌ సుఖ్‌ నగర్‌, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్‌, లక్డీక పూల్‌, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.

New Service at Mee Seva: ఇకపై ప‌హాణీ కాపీల కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవ‌సరం లేదు, తాజాగా మ‌రో 9 కొత్త సేవ‌ల‌ను చేర్చుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

VNS

తెలంగాణ‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్‌ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న‌ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్ర‌క‌టించింది.

Airbus Beluga in Hyderabad: హైద‌రాబాద్ లో ల్యాండ్ అయిన ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానం, వేల్ ఆఫ్ ది స్కై ప్ర‌త్యేక‌త‌లివే! (వీడియో ఇదుగోండి)

VNS

వేల్ ఆఫ్ ద స్కై' (Whale of the Sky) గా పిలవబడే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Airbus Beluga) విమానం.. శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. 'ఎయిర్ బస్ బెలూగా'(Airbus Beluga) అనే పేరు గల తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం, ఇప్పటివరకు హైదరాబాద్ కు రెండు సార్లు రాగా.. మూడోసారి,

Advertisement

Congress Leader Pallam Raju: హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!

Arun Charagonda

హైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది.

MLA Rajagopal Reddy On Uttam Kumar Reddy: వీడియో ఇదిగో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావడం పక్కా, నా నాలుక మీద మచ్చలున్నాయి..జరిగి తీరుతుందన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌లో దుమారం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్

Arun Charagonda

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. భ‌విష్య‌త్‌లో త‌ప్ప‌నిస‌రిగా సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు. నా నాలుక‌పై పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌నిస‌రిగా మంత్రి ఉత్త‌మ్ సీఎం అవుతారని చెప్పారు. భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో నీటి పారుద‌ల పనుల‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో దుమారం రేపాయి.

Gurukul School Staff Harass Students: విద్యార్థినులకు పురుగుల అన్నం, టీచర్లకు పరమాన్నం..ఇది గురుకులాల పరిస్థితి, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థినులు!

Arun Charagonda

తెలంగాణలో పాలన పడకేసిందా?, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారేలేరా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.

Advertisement

CM Revanth Reddy On Yadadri: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, పెండింగ్ పనుల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని..ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.

Gurukul School Students Protest: పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు.

Robert Vadra At Hyderabad: హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా, ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించిన వాద్రా

Arun Charagonda

కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు వాద్రా. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు వాద్రా. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు.

Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం

Arun Charagonda

రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్‌ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి

Arun Charagonda

దేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

YSRCP MLCs Resign: వైసీపీకి మరో షాక్, పార్టీకి - ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు!

Arun Charagonda

వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి.

Jurala Project: రికార్డు స్థాయిలో జురాలకు పోటెత్తిన వరద, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతున్న వరదనీరు..వీడియో

Arun Charagonda

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి,నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతోంది వరద నీరు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,10,000 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు ఓట్ ఫ్లో: 3,00,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీంఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.010 టీఎంసీలుగా ఉంది.

Advertisement
Advertisement