తెలంగాణ
TS Weather Report: తెలంగాణ వెదర్ అలర్ట్, ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ
Hazarath Reddyతెలంగాణలో పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
Twin Towers Near Secretariat: సచివాలయ సమీపంలో ట్విన్‌ టవర్స్‌.. అమరవీరుల స్థూపం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం
Rudraనూతన సచివాలయం నిర్మాణం పూర్తయిన ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్‌వోడీ) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.
High Temperatures in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఎండలే.. మంగళ, బుధవారాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం.. హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక.. సూర్యాపేటలో సోమవారం వడదెబ్బకు ఇద్దరు వృద్ధుల మృతి
Rudraతెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
Telangana: వరంగల్ జిల్లాలో అబార్షన్ల ముఠా గుట్టు రట్టు, ఇద్దరు ప్రముఖ వైద్యులతో సహా 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలు తెలిపిన సీపీ రంగనాథ్‌
Hazarath Reddyవరంగల్‌ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్‌లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. లింగనిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు
Sharmila Met DK Shivakumar: డీకే శివకుమార్‌తో భేటీ అయిన వైఎస్‌ షర్మిల, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన సమావేశం, వీడియో ఇదిగో..
Hazarath Reddyబెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కాగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకే వెళ్లారా..లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది.
Accident in Banjarahills: హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు
Rudraహైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని రెయిన్ బో హాస్పిటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొంది. ఆ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Rains in Telangana: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం
Rudraరానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది.
Minister Harish Rao: తెలంగాణలో బీజేపీ పనైపోయింది, బీజేపీలో ఉంటే గెలవడం ఏమో కానీ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
kanhaతెలంగాణలో బీజేపీ పనైపోయింది. బీజేపీలో ఉంటే గెలవడం ఏమో కానీ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు - మంత్రి హరీష్ రావు
Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వేసవి వడగాడ్పుల నుంచి ఉపశమనం..
kanhaహైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్ , కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Khammam Politics: టెన్షన్‌లో కేసీఆర్ మీద పొంగులేటి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడు : పొంగులేటి సన్నిహితుడు మట్టా దయానంద్ సంచలన వ్యాఖ్యలు
kanhaటెన్షన్‌లో కేసీఆర్ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడని పొంగులేటి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మట్టా దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Voter List Verification in Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ.. జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే.. అక్టోబర్ 10న తుది జాబితా విడుదల.. అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
Rudraతెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
CM KCR Press Meet: మోడీ పాలన చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్సు వ్యతిరేకిస్తున్నాం - తెలంగాణ సీఎం కేసీఆర్
kanhaప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆగ‌డాలు మితిమీరిపోతున్నాయి... ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ధ్వ‌జ‌మెత్తిన సీఎం కేసీఆర్
CM KCR Press Meet: కర్ణాటకలో మోడీ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్రు కాల్చి వాత పెట్టారు సీఎం కేసీఆర్ ఫైర్..
kanhaకర్ణాటకలో మోడీ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్రు కాల్చి వాత పెట్టారు - సీఎం కేసీఆర్
Telangana CM KCR Meets Delhi CM : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.
kanhaతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, హైదరాబాదులోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
Yoga Mahotsav: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..
Rudraఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వచ్చారు. కిషన్‌ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??
Rudraప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
Telangana Bonalu: తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు.. బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష.. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు
Rudraజూన్ 22 నుంచి రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభమవుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు
Rudraమొన్నటివరకూ అకాల వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలో నేటి నుంచి సోమవారం వరకు ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.