తెలంగాణ

Video: షాకింగ్ వీడియో, పురీషనాళంలో బంగారు ముద్దను పెట్టుకుని మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు

Hazarath Reddy

కస్టమ్స్ కు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మస్కట్ నుండి వచ్చిన ఒక భారతీయ పురుష ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అడ్డగించింది. ప్రయాణికుడు పురీషనాళంలో దాచిన బంగారు ముద్దను తీసుకెళుతున్నట్లు గుర్తించారు.

Hyderabad Shocker: భర్త గుండెపోటుతో మృతి, పతి మరణం తట్టుకోలేక అంత్యక్రియలు పూర్తయిన మరునాడే భార్య ఆత్మహత్య

Hazarath Reddy

ఒక సంవత్సరం క్రితం మనోజ్, సాహితికి వివాహం జరగగా అమెరికా వెళ్ళిపోయారు. సాహితి తల్లితండ్రులను చూడటానికి ఈనెల 2న హైదరాబాద్ రాగా ఆమె భర్త 20న గుండెపోటుతో మరణించాడు. భర్త మరణం తట్టుకోలేక అంత్యక్రియలు పూర్తయిన మరునాడే సాహితి చీరతో ఉరివేసుకొని చనిపోయింది.

Saivarshith-Biden Case: బైడెన్‌ను చంపేందుకే వచ్చానన్న తెలుగు యువకుడు సాయివర్షిత్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా?!

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- తెలుగు యువకుడు సాయివర్షిత్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్‌ ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Hyderabad Shocker: నిద్రపోతుండగా మూడేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన కారు, బాలికను కారు ఢీకొట్టిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ భవనం పార్కింగ్‌ స్థలంలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటన హృదయ విదారకంగా జరిగింది. బాలికను కారు ఢీకొట్టిన భయానక దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారాయి.

Advertisement

TS EAMCET 2023 Results Out: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను eamcet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

KCR Review Meet: కొత్త సచివాలయంలో తొలిసారి కలెక్టర్లలో సదస్సు, దశాబ్ది ఉత్సవాలు సహా పలు కీలక అంశాలపై దిశానిర్ధేశం చేయనున్న ముఖ్యమంత్రి

VNS

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

TS Eamcet Results: మరికాసేపట్లో తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల, ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చంటే!

VNS

టీఎస్‌ ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, ఫార్మసీ) (TS EAMCET) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra reddy) విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్‌ చేస్తారు.

Telangana Politics: ఇటలీ నుంచి వచ్చిన మీ సోనియా గాంధీకి చీరెసారె పెట్టి పంపు , రేవంత్ రెడ్డిపై మండిపడిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

నాది ఆంధ్రా అని, చీరెసారె తీసుకోవాలని, ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చెబుతున్న రేవంత్ రెడ్డికి.. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి కూడా చీరెసారె పెట్టి రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో అభద్రతాభావానికి లోనై, తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు

Advertisement

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

Telangana Shocker: డబ్బుల వ్యవహారం, మహిళను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసిన కిరాతకుడు, మొండెం లేని తల కేసులో పోలీసులు కీలక పురోగతి

Hazarath Reddy

మలక్‌పేట్‌ పరిధిలో తల లేని మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండెం లేని తల కేసులో మృతురాలు కేర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు.

Telangana: సార్ మా అమ్మానాన్న రోజూ కొడుతున్నారు, వారిని శిక్షించండి, పోలీస్ స్టేషన్ గడప తొక్కిన బాలుడు, భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి

Hazarath Reddy

శంకరపల్లిలో ఓ బాలుడు తల్లిదండ్రులు కొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. స్టేషన్ కి వెళ్లి ‘సార్‌.. మా అమ్మానాన్న కొడుతున్నారు.. నిత్యం నరకం చూపిస్తున్నారు. వారిని శిక్షించండి’’అంటూ శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు.

Hyderabad: వీడియో ఇదిగో, మత్తుకి బానిసై ఇంట్లోనే రహస్యంగా గంజాయి సాగు, యువకుడిని అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు

Hazarath Reddy

వనస్థలిపురంలోని ఓ ఇంట్లో మొక్కల చాటున గంజాయి సాగు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయికి అలవాటు పడిన యువకుడు విశాఖ నుండి గంజాయి సీడ్స్‌ను తీసుకొచ్చి ఇంట్లోనే గంజాయిని సాగు చేస్తున్నాడు.

Advertisement

10th Telangana Formation Day Celebrations: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, 21 రోజుల పాటు రోజుకో సంబురం నిర్వహించనున్న కేసీఆర్ సర్కారు, షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.

Telangana Shocker: కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి చివరకు ప్రియుడితో కలిసి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Hyderabad Shocker: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన

Hazarath Reddy

ప్రేమలో విఫలమైన ఓ యువకుడు బేగంపేట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో కాల్‌ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌, విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ను ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు.. సుప్రీంకోర్టు సూచించింది. ముందుస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే హక్కు అవినాష్‌ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Telangana: వీధి కుక్క అనారోగ్యంతో చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు, సెక్షన్ 11 యానిమల్ క్రూయాలిటీ కింద కేసు నమోదు

Hazarath Reddy

అనారోగ్యంతో వీధి కుక్క చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద జంతు సంక్షేమ కార్యకర్త కేసు పెట్టారు. పంజాగుట్ట - జీహెచ్ఎంసీ డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను పట్టుకెళ్లగా అందులో ఒక కుక్క చనిపోగా, మరొకటి అనారోగ్యం పాలైంది.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ కూడా

Rudra

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Ponguleti vs Puvvada: ఖమ్మంలో మంత్రి పువ్వాడని బచ్చా గాడిని పెట్టి ఓడిస్తా, నేను అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఓడగొట్టడనికి నేను అవసరం లేదు, బచ్చా గాడిని పెట్టి ఓడిస్తా - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Rains In Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. వీడియోతో

Rudra

ఎండలతో సతమతం అవుతున్న హైదరాబాదీలకు వరుణుడు కాస్త సాంత్వన కలిగించాడు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌తో పాటూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, శాంలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.

Advertisement
Advertisement