T-Cong First list: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ, 58 మందితో తొలి జాబితాను రిలీజ్ చేయనున్న అధిష్టానం, ఆ రెండు అంశాల ఆధారంగా టికెట్లు కేటాయించామన్న నేతలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆదివారం 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్‌ను (T congress First list) విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది.
New Delhi, OCT 14: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆదివారం 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్‌ను (T congress First list) విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఇక, భేటీ అనంతరం, మురళీధరన్ (Muralidharan) మాట్లాడుతూ.. ఆదివారం తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తాం. తొలి జాబితాలో భాగంగా 58 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశాం. ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తాం. సీపీఐ (CPI), సీపీఎం (CPM) పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయి. పొత్తులపై స్పష్టత వస్తుంది. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తాం. పార్టీ నుంచి నేతలు నేతలు బయటకు వెళ్లడం మా పార్టీ అంతర్గత విషయం. ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. 119 స్థానాల్లో మెజార్టీ పార్టీ నేతలకు సీట్ల కేటాయింపు ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు.
Ponnala Meets KTR: పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
గెలుపు అవకాశాలు ఉండి, పార్టీకి విధేయులుగా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం తమ అంతర్గత విషయమని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. కాగా, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఇప్పటికే కాంగ్రెస్ చెప్పింది. మైనారిటీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Oct 14, 2023 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

