Ganesh Chaturthi (Photo Credits: Wikimedia Commons)

Telangana, May 12: వినాయక చవితి 2020 ఆగస్టు 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి సందడి మొదలైంది. భారతీయ పండుగలలో ఒకటైన వినాయక చవితి (Ganesh Chaturthi 2020) ఉత్సవాలు దేశం మొత్తం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ఈ పండగను భారీగా నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో (Telangana) అయితే ఖైరతాబాదు వినాయకుడు (Khairatabad Ganesh Idol) పేరు టక్కున గుర్తుకువస్తుంది.

తెలంగాణలోని హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్‌ గణేశ్‌ ను చూడటానికి ప్రతి ఏడాది భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తారు. మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

ఏడాదికేడాది ఖైరతాబాదు వినాయకుడు ఎత్తు పెరుగుతూ వెళుతున్న నేపథ్యంలో ఈ సారి లాక్ డౌన్ దెబ్బకి వినాయకుడు చిన్నవాడైపోయాడు. కరోనా వైరస్‌ కారణంగా కేవలం ఒక అడుగు ఎత్తులో మాత్రమే ఖైరతాబాదు వినాయకుడు ప్రతిమను ప్రతిష్టించనున్నారు.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం ఎత్తుపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును గణేశ్‌ ఉత్సవ కమిటీ విరమించుకుంది. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా కమిటీ రద్దు చేసింది. ఈ ఏడాది ఒక అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది. కాగా ఇక్కడ గవర్నర్ తొలి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా తగ్గేంత వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉండటంతో... ఎవరికీ ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఉత్సవ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది.  ఏప్రిల్ 29న తెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు, 16 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి

2019లో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తుల ముందుకు వచ్చాడు ఖైరతాబాద్‌ వినాయకుడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో గణేషుడు భక్తులకు కనువిందు చేశాడు. 1954లో తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఒక అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి నుంచి ఏడాదికి ఓ అడుగు చొప్పున 60 ఏళ్లపాటు ఎత్తును పెంచుకుంటూ పోయారు. 2014 నుంచి ఏడాదికి ఒక అడుగు చొప్పున ఎత్తు తగ్గించాలని నిర్ణయించారు. విగ్రహం ఎత్తు తగ్గించినా దాని తలపైన మరో అలంకరణతో ఎత్తు పెంచేస్తున్నారు.