IT Firms Analysis 2023 (photo-File Image)

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఐటీ రంగానికి JP Morgan రిపోర్ట్ రూపంలో వచ్చిన నివేదిక షాక్ తగిలిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు తెలిపారు. అయితే ఊరటనిస్తూ 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్‌ డీల్స్‌ మెరుగుపడే అవకాశం ఉందని భావించారు.

రాబోయే రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మరియు భారతీయ IT కంపెనీలు అందించిన వ్యాఖ్యానాలను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని JP మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారు 2025 ఆర్థిక సంవత్సరంలో సంతకం చేసిన డీల్‌ల సంఖ్య పుంజుకునే సూచనల కోసం వెతుకుతున్నారు మరియు FY 2024ని వారు "వాష్‌అవుట్"గా అభివర్ణిస్తున్నారు.

అమెజాన్ ఇండియాలో లక్ష ఉద్యోగాలు, పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు సృష్టించిన ఈ కామర్స్ దిగ్గజం

బుధవారం విడుదల చేసిన ఇటీవలి నోట్‌లో, విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా ఈ రంగం గురించి తమ నిరాశావాదాన్ని వ్యక్తం చేశారు, “మా ఇటీవలి అంచనాల సమయంలో డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలను మేము ఇంకా గమనించనందున పరిశ్రమపై మా దృక్పథం బేరిష్‌గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంలో కంటే తక్కువ అనుకూలంగా ఉందని మేము విశ్వసిస్తున్నాము.

దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్‌సిఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ మంది యుఎస్ బేస్డ్‌ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్యమవుతాన్నాయని తెలిపాయి.

రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు

ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్‌అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్‌ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది.

కాగా ఇప్పటికే భారత్‌ సహా,దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి.ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్‌ మీద ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్‌బోర్డింగ్ జాప్యం, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్‌ కంపెనీల్లో వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు.