World
Gas Tanker Blast in Nigeria: నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ పేలి 140 మంది మంటల్లో సజీవ దహనం, హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో బోల్తా
Hazarath Reddyనైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 140 మంది దుర్మరణం పాలయ్యారు. జిగావా రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీస్ ప్రతినిధి లావన్ ఆడమ్ పేర్కొన్నారు.
Man Caught Urinating On Metro Train Track: వీడియో ఇదిగో, మెట్రో స్టేషన్‌లో అమ్మాయిల ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేసిన యువకుడు
Hazarath Reddyకొద్ది రోజుల క్రితం, పారిస్ విమానాశ్రయంలో మల విసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. రద్దీగా ఉండే విమానాశ్రయంలో పూర్తిగా నగ్నంగా కూర్చొని ఒక వ్యక్తి మలవిసర్జన చేశాడు. విమాన ప్రయాణికులు అతని చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జపాన్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు మార్గంలో ఓ యువకుడు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు.
USA Airstrikes on ISIS Camps: సిరియాపై అమెరికా బాంబుల వర్షం, ఐసీస్ స్థావరాలను టార్గెట్ చేశామని యూఎస్ ప్రకటన, తమపై దాడులకు కుట్ర చేస్తుందనే సమాచారంతోనే క్షిపణి దాడులు
VNSఅగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని (Syria) ఐసీస్ (ISIS) ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు (Airstrikes In Syria) చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Crown Of Maa Kali Stolen: ప్రధాని మోదీ బహూకరించిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.. బంగ్లాదేశ్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraదేశవ్యాప్తంగానే కాదు బంగ్లాదేశ్ లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. అయితే, బంగ్లాలోని సత్ ఖిరా నగరంలోని శ్యామ్ నగర్ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం చోరీకి గురైంది.
North Korea: దక్షిణ కొరియా విషయంలో కిమ్ సంచలన నిర్ణయం, సరిహద్దును శాశ్వతంగా మూసేస్తూ ప్రకటన
VNSఉత్తర కొరియా (North Korea) – దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది.
Hurricane Milton Update: అమెరికాను వణికిస్తున్న హరికేన్ మిల్టన్, తీవ్ర తుఫాన్‌గా మారడంతో ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటన, ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు
Hazarath Reddyమిల్టన్ హరికేన్ బుధవారం ఫ్లోరిడా పశ్చిమ తీరం వెంబడి విపత్తు ఢీకొనే దిశగా దూసుకెళ్లింది, లక్షలాది మందిని ఖాళీ చేయమని ఆదేశించిన తర్వాత కొంతమంది నివాసితులు తాము అక్కడే ఉంటామని పట్టుబట్టారు. అయితే అధికారులు మాత్రం కుదరదు ప్రాణాలు పోతాయని హెచ్చరించారు
Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్
Hazarath Reddyభౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.
Fully Naked Man Defecates in Airport: విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మలవిసర్జన చేసిన ప్రయాణికుడు, పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా బట్టలు విప్పేసి మరీ..
Hazarath Reddyవైరల్ ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా లేదా విచారంగా లేదా వింతగా, వింతగా లేదా వింతగా ఉంటాయి. పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో పూర్తిగా నగ్నంగా ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraకరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
India-Maldives Relations: భారత్ మాకు చాలా అవసరం, యూటర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ఏమన్నారంటే..
Hazarath Reddyమాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు.
Nobel Prize in Medicine 2024: విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం
Hazarath Reddyస్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌లో మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Terror Attack at Karachi Airport: కరాచీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి.. ముగ్గురు మృతి
Rudraపాములు పట్టే వ్యక్తి ఆ పాము కాటుకే బలైనట్టు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో వణికిపోతున్నది.
Bathukamma Festival: మన బతుకమ్మకు అమెరికాలో గౌరవం.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు
Rudraతెలంగాణ సాంసృతిని చాటే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే.
World's Largest Residential Building: ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20 వేల మందికి పైగా ఆవాసం.. చైనాలో భవంతి.. వీడియో ఇదిగో..!
Rudraఒక భవనంలో ఎంత మంది ఉంటారు? అపార్ట్ మెంట్ అయితే, మహా అయితే, ఓ వంద, రెండొందల మంది ఉంటారు. అంతేగా.. అయితే, ఓ భవనంలో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు.
One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత
Rudraప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
California: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం, ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు, ఫైరింజన్ల సాయంతో అదుపులోకి మంటలు...వీడియో
Arun Charagondaకాలిఫోర్నియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న ఓ విమానం హ్యారీ రీడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Israel Attack On Gaza Mosque: గాజాపై మరోసారి విరుచుకపడ్డ ఇజ్రాయెల్, మసీదుపై వైమానిక దాడి, 21 మంది మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaగాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Boat Capsize in Congo: సరస్సులో మునిగిపోతున్న బోటు వీడియో ఇదిగో, 87 మంది మృతి, వందల మంది గల్లంతు
Hazarath Reddyకాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో సరస్సులో బోల్తా పడింది
Russian TikToker Dies: వీడియో ఇదిగో, టిక్ టాక్ వీడియో చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడి యువతి మృతి, పుర్రె పగలడంతో సహా తీవ్ర గాయాలతో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyరష్యన్ టిక్‌టోకర్ అరినా గ్లాజునోవా, 27, జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో విషాదకరంగా మరణించింది. గ్లాజునోవా స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ, బ్యాలెన్స్ కోల్పోయి, ప్రాణాపాయ స్థితిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
Boat Capsizes in Nigeria: నైజర్ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన
Vikas Mనైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లి వెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.