Luna-25 Lunar Lander takes off from Vostochny Cosmodrome (Screengrab of video posted by Roscosmos on Telegram)

New Delhi, AUG 11: భారత్ తర్వాత ఇప్పుడు రష్యా కూడా లూనా మిషన్ లూనా-25ను (Russias Luna) ప్రారంభించింది. 47 ఏళ్ల తర్వాత రష్యా తన వాహనాన్ని చంద్రుడి మీదకు (Moon) పంపింది. రాజధాని మాస్కోకు తూర్పున 5500 కిలో మీటర్ల దూరంలో ఉన్న అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా 25ను ప్రయోగించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా దీన్ని ప్రయోగించినప్పటికీ.. చంద్రయాన్ (Chandrayaan) కంటే ముందే చంద్రుడిపై అడుగు పెట్టనుందని చెబుతున్నారు. రష్యా మీడియా ప్రకారం.. ఆగస్ట్ 11 శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు లూనా-25 ల్యాండర్ రష్యాలోని వోస్టోని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. సోయుజ్ 2.1బి రాకెట్‌లో లూనా-25 చంద్రుడిపైకి పంపబడింది. దీనికి లూనా-గ్లోబ్ మిషన్ (Luna-25 Mission) అని పేరు పెట్టారు. రాకెట్ పొడవు 46.3 మీటర్లు కాగా, దాని వ్యాసం 10.3 మీటర్లు. లూనా-25 చంద్రుడిపైకి బయల్దేరిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. ఐదు రోజుల పాటు అది చంద్రుడి వైపు కదులుతుంది. దీని తరువాత, 313 టన్నుల బరువున్న రాకెట్ 7-10 రోజుల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఆగస్టు 21 లేదా 22న చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుందని అంచనా.

Hawaii Wildfire: అమెరికాలో కాలిబూడిదైన అడవి, 53 మంది సజీవదహనం, మంటల నుంచి తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకి చనిపోయిన స్థానికులు 

రష్యా మీడియా ప్రకారం.. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించాలని రష్యా యోచిస్తోంది. చంద్రుడి ఈ ధ్రువంపై నీరు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో నీరు ఉందని 2018లో నాసా చెప్పింది. లూనా-25లో రోవర్, ల్యాండర్ ఉన్నాయి. దీని ల్యాండర్ దాదాపు 800 కిలోలు ఉంటుంది. లూనా-25 సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది. ల్యాండర్‌లో ఒక ప్రత్యేక పరికరం ఉంది, ఇది ఆరు అంగుళాల ఉపరితలాన్ని తవ్వుతుంది. లూనా 25 రాక్, మట్టి నమూనాలను సేకరిస్తుంది. ఇది ఘనీభవించిన నీటి ఆవిష్కరణకు దారితీయవచ్చు. భవిష్యత్తులో మానవులు చంద్రునిపై తమ స్థావరాన్ని నెలకొల్పినప్పుడల్లా వారికి నీటి సమస్య ఉండకూడదనేది రష్యా లక్ష్యం.

Chandrayaan 3: భూమి, చంద్రుని ఫోటోలను తీసిన చంద్రయాన్ 3, ఆగస్టు 23న చంద్రునిపై అడుగుపెట్టనున్న భారతదేశం మూడవ చంద్రయాన్ మిషన్ 

లూనా 25.. ఆగస్టు 21 లేదా 22న చంద్రుడి ఉపరితలంపైకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే చంద్రయాన్-3ని భారతదేశం జూలై 14న ప్రయోగించింది. ఇది ఆగస్టు 23న చంద్రునిపైకి రానుంది. లూనా-25, చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. లూనా కొన్ని గంటల ముందు చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. రష్యా ఇంతకు ముందు 1976లో చంద్రుడిపై లూనా-24ను ల్యాండ్ చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన మూన్ మిషన్‌లన్నీ చంద్రుని భూమధ్యరేఖకు చేరుకున్నాయి. అయితే లూనా-25 విజయవంతమైతే చంద్రుని దక్షిణ ధ్రువంపై ఒక దేశం అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది.