34 Years in Prison for Tweeting: ట్విట్టర్ వాడినందుకు 34 ఏళ్లు జైలుశిక్ష, సౌదీ అరేబియాలో మహిళకు శిక్ష విధించిన కోర్టు, దేశ భద్రతకు భంగం కలిగించిందని ఆరోపణలు, సౌదీకి చెందిన మహిళ బ్రిటన్‌లో ట్వీట్లు చేసినందుకు కఠిన శిక్ష
Representative image

BEIRUT, AUG 18: సౌదీ అరేబియాలో శిక్షలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అయితే తాజాగా ఓ కేసులో మహిళకు 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది సౌదీ కోర్టు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? ట్వీట్ (Tweet) చేయడమే ఆమె చేసిన నేరం. మహిళల హక్కుల కోసం ట్వీట్లు చేయడంతో ఆగ్రహించిన కోర్టు...ఆమెకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిజమే ట్విట్టర్ వాడినందుకు 34 ఏళ్ల మహిళకు, 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా కోర్టు(Saudi Arabia). సల్మా అల్ షెహాబ్ (Salma Al-Shehab) అనే మహిళ బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో పీహెచ్‌డీ చేస్తూ, అక్కడే పనిచేస్తోంది. అయితే, బ్రిటన్‌లో తనకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా మహిళల హక్కులకు అనుకూలంగా పలు ట్వీట్లు (Tweets) చేసింది. అలాగే ఇతర ఉద్యమకారులు, ఉద్యమ సంస్థలు చేసే ట్వీట్లను రీట్వీట్ చేసింది. దీనిపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Death Threats to JK Rowling: హ్యారీ పొర్టర్ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు, ట్విట్టర్‌లో బెదిరించిన ఆగంతకుడు, కంగారు పడొద్దు. తర్వాత నంబర్‌ మీదే అంటూ బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు 

దీంతో ఆమెపై స్థానిక తీవ్రవాద కోర్టులో విచారణ జరిపారు. ఆమెకు 34 ఏళ్ల జైలు శిక్ష (34-year prison sentence) విధించారు. దేశాన్ని అస్థిర పరిచేందుకు, ప్రజా జీవితానికి భంగం కలిగించేందుకు సల్మా ప్రయత్నించిందని, దేశ భద్రతకు భంగం కలిగించిందని, ట్విట్టర్ ద్వారా అసత్యాల్ని ప్రచారం చేసిందని కోర్టు ఆమెపై అభియోగాలు మోపింది. ఈ నేరాలకుగాను, సల్మాకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది చివరలో ఆరు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించారు. అయితే, తాజాగా ఈ శిక్షను 34 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

US Crime: తల్లిని చంపిన కొడుకు, అంతటితో ఆగకుండా రోడ్ల మీద జనాలను కూడా చంపాలని చూసిన ఉన్మాది, అమెరికాలో దారుణ ఘటన 

షెహాబ్ కొంతకాలంగా మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.  ఆమె సోదరి కూడా ఉద్యమకర్త. ఆమె కూడా దాదాపు వెయ్యి రోజులకుపైగా జైలు శిక్ష అనుభవించింది. తాజా తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సల్మాకు నెల రోజుల గడువుంది. సల్మాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సౌదీలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయనేందుకు తాజా సంఘటన మరో ఉదాహరణ.