హిందీ జాతీయ మార్కెట్లో బాహుబలి, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల విజయం వాస్తవానికి తెలుగు సినిమా సరిహద్దులను చెరిపేసింది. అంతకుముందు నటీనటుల క్రాస్ఓవర్ ఉన్నప్పటికీ, బాలీవుడ్లో తమ అదృష్టం పరీక్షించు కోవడానికి తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు ముంబైకి వెళ్లేవారు. అలా చాలా మంది చిత్రాలను నిర్మించి హిట్లు చవిచూశారు కూడా.

కానీ ఇప్పుడు చాలా మంది తెలుగు నిర్మాతలు బాలీవుడ్‌లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుండగా, ఈ బాలీవుడ్ బడా నిర్మాత మాత్రం దక్షిణం వైపుకు చూస్తున్నాడు. బోనీ కపూర్ ఇప్పటివరకు ఉన్న  సినీ సంస్కృతికి విరుద్ధంగా సినిమాలు నిర్మించడానికి  ప్రయత్నిస్తున్నాడు.

"నెర్కొండ పర్వై " అనే తమిళ  చిత్రంతో (పింక్ మూవీకి రీమేక్) ఆయన ఇటీవలే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు, ఇప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టాడు.

తెలుగులో  బడా నిర్మాత అయిన దిల్ రాజుతో కలిసి "బాధయి హో" అనే హిందీ యొక్క తెలుగు రీమేక్‌ను నిర్మించనున్నట్లు సినీ టౌన్ లో బజ్ తెలుపుతోంది.

ఈ విధంగా చూస్తే బోణి కపూర్  చాలా కాలం తరువాత తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాడు, అంతకుముందు ఆయన హిట్ తెలుగు సినిమాలు చూసి వాటిని హిందీలో నిర్మించే వాడు కాని తెలుగులో ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదు.

కానీ ఇప్పుడు రివర్స్ గేర్లో, హిట్  హిందీ సినిమాలను తెలుగు లో రీమేక్ చెయ్యసంకల్పించాడు.

Watch Badhaai Ho Full Movie Trailer here:

బదాయ్ హో యొక్క రీమేక్‌లో ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరో కనిపించవచ్చు అని ఇండస్ట్రీ సమాచారం, వారు నాగ చైతన్యతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారని అక్కడి వినికిడి. ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులు గర్భవతి కావడం మరియు కుటుంబం భావోద్వేగాల అనంతర ప్రభావాలు మరియు సమాజంలోని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర ముఖ్య కథ.